1. "Valley" అనగా అర్ధము ఏమిటి?
2. "లోయలు"వేటితో కప్పబడియుండునని దావీదు అనెను?
3. ఎవరు గెరారు లోయలో గుడారము వేసుకొని నివసించెను?
4. దర్శనపు అందమైన "లోయల"నిండ ఏమి యున్నవని యెహోవా అనెను?
5. ఏ "లోయలోని" వారికి ఇనుపరధములున్నవని యోసేపు పుత్రులు యెహోషువతో అనిరి?
6. ఎవరు నివసించు "లోయలో" నుండి యెహోవా ఇశ్రాయేలీయులను వెళ్లవద్దనెను?
7. ఏది బేతెహోబునకు సమీపమైన "లోయలో" నున్నది?
8. యెహోషువను ధైర్యపరచి దృఢపరచమని యెహోవా మోషేతో చెప్పిన తర్వాత దేని యెదుటనున్న "లోయలో" వారు జనులతో దిగిరి?
9. దావీదుతో యుద్ధమునకు ఫిలిష్తీయులు ఎవరి "లోయలో" దిగిరి?
10. "లోయల"లోని పశువుల మీద అద్దయి కుమారుడైన ఎవరు నియమింపబడెను?
11. "లోయలో "నీ యొక్క దేనిని చూడుమని యెహోవా ఇశ్రాయేలుతో అనెను?
12. యేలు యూదా వారు ఏ "లోయలో" నున్న బయలునకు బలిపీఠములను కట్టిరి?
13. తీర్పు తీర్చు "లోయలో" రావలసిన ఏమి వచ్చేయున్నది?
14. యెహోవా భూమి యొక్క ఎక్కడ నడువబోవుచున్నప్పుడు "లోయలు"విడిపోవును?
15. యెహోవా యుద్ధము చేయు దినమున ఏ కొండ జరిగి విశాలమైన "లోయ"ఏర్పడును?
Result: