①. నా జనులకు నిన్ను "లోహపు"తుంటగా నియమించియున్నానని యెహోవా ఎవరితో అనెను?
②. మట్టి"లోహము"వంటి నా జనులు ఏమైన వారని యెహోవా అనెను?
③.ఇశ్రాయేలీయులందరును కొలిమిలోని ఏ "లోహముల"వంటి వారైరని యెహోవా సెలవిచ్చెను?
④. నా శరీరము ఏ లోహము వంటిదా? అని యోబు ప్రశ్నించెను?
⑤. భక్తిహీనులు ఏ లోహపు ఆయుధము తప్పించుకొనుటకై పారిపోవుదురు?
⑥. ఏ పట్టణములోని వెండి బంగారు లోహములను కొల్లపెట్టుడి అని యెహోవా సెలవిచ్చెను?
⑦ ఉత్తరము నుండి వచ్చు ఇనుము కంచు వంటి లోహములను ఎవడైన విరువగలడా? అని ఎవరు ప్రశ్నించెను?
⑧. సొలొమోను మందిరమునకు మేకులను ఏ లోహముతో చేయించెను?
⑨. నీటిగుర్రము యొక్క యెముకలు ఏ లోహము గొట్టముల వలె యున్నవని యెహోవా అనెను?
①⓪. ఏది ఇనుము లోహమును గడ్డిపోచగా ఎంచునని యెహోవా అనెను?
①①. మాదీయులు ఏ లోహమును లక్ష్యము చేయరని యెహోవా అనెను?
①②. ఏ లోహము మాదీయులకు రమ్యమైనదికాదని యెహోవా అనెను?
①③. ఐగుప్తీయులు మహాఅగాధమైన నీళ్లలో ఏ లోహము వలె మునిగిరి?
①④. మందిరము కట్టు స్థలమున ఇనుప లోహపు ఆయుధములైన వేటి ధ్వని వినబడలేదు?
①⑤ కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది గాని దేని లోనికి లోహమైన సీసమే వచ్చుచున్నది అని యెహోవా అనెను?
Result: