1. "వల" ఎవరిని చిక్కించుకొనును?
2. తాము ఒడ్డిన "వలలో" ఎవరి కాలు చిక్కుబడియున్నది?
3. అడుగులను చిక్కించుకొనుటకై ఎవరు "వల" యొడ్డిరని దావీదు అనెను?
4. తన పొరుగువానితో ఏమి ఆడువాడు వాని పట్టుకొనుటకు "వల"వేయువాడు?
5. తమకు ఏమి కలుగునప్పుడు నరులు చేపలు బాధాకరమైన "వలలో చిక్కుబడునట్లు చిక్కుబడుదురు?
6. ఎవరి కుమారులు దుప్పి "వలలో" చిక్కుపడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడియున్నారు?
7. యెహోవా తన "వలను"ఎవరి మీద వేయగా జనులు గుంపులుగా వచ్చి ఆతని బయటకి లాగెదరు?
8. యాజకులు ఇశ్రాయేలీయులు రాజ సంతతి వారు దేని మీద "వలగా" ఉన్నారని యెహోవా అనెను?
9. ప్రతి మనుష్యుడు ఏమియై తన సహోదరుని మీద "వలలను" ఒగ్గును?
10. ఎవరు తన "వలతో" మానవులను కూర్చుకొని సంతోషపడుచున్నారు?
11. పక్షి చూచుచుండగా "వల"వేయుట ఏమిటి?
12. యెరూషలేము రాజు చేసియున్న తిరుగుబాటును బట్టి యెహోవా "వల" నొగ్గి ఆతనిని పట్టుకొని ఎక్కడికి తీసుకొని పోవును?
13. ఎవరు అన్యదేశముల వారి యొద్దకు వెళ్ళగా యెహోవా వారి పైన "వల" వేయును?
14. దుర్మార్గులు తమ "వల"వలన మంచి భాగము కలుగుచున్నదని తమ "వలకు "ఏమి అర్పించును?
15. ఎవరు బాధపడువారిని తమ "వల" లోనికి లాగి పట్టుకొందురు?
Result: