Telugu Bible Quiz Topic wise: 753 || తెలుగు బైబుల్ క్విజ్ ( "వలలు" అనే అంశముపై క్విజ్ )

①. Snares అనగ అర్ధము ఏమిటి?
Ⓐ వలలు
Ⓑ బాణములు
Ⓒ ఈటెల
Ⓓ చిక్కములు
②. ఎవరిలో ప్రధానుడగు వానిని పట్టుకొనుటకు యెహోవా "వల"యొగ్గును?
Ⓐ ఐగుప్తులో
Ⓑ అష్షూరులో
Ⓒ ఇశ్రాయేలులో
Ⓓ మోయాబులో
③. యెహోవా ఏ నివాసులకు చిక్కు"వల"గాను ఉండును?
Ⓐ అమ్మోనియా
Ⓑ ఫిలిష్తీయ
Ⓒ యోబును
Ⓓ యెరూషలేము
4. ఇశ్రాయేలువారు దేని మీద "వల"గాను ఉన్నారని యెహోవా అనెను?
Ⓐ తాబోరు
Ⓑ హసోరు
Ⓒ బెయేరు
Ⓓ జెబేరు
⑤. ఎవరు తమ చర్యయంతటిలోను వేటకాని "వల"వంటివారై యున్నారని యెహోవా అనెను?
Ⓐ యాజకులు
Ⓑ ప్రవక్తలు
Ⓒ ఏలికలు
Ⓓ పాలకులు
⑥. ఎవరిని పట్టుకొనుటకై యెహోవా "వల"నొగ్గును?
Ⓐ తూరురాజును
Ⓑ మోయాబురాజును
Ⓒ బబులోనురాజును
Ⓓ అష్షూరురాజును
⑦. ఏవి "వలలో"పట్టుబడునట్లు నరులు చిక్కుబడుదురు?
Ⓐ కుందేళ్లు
Ⓑ జింకలు
Ⓒ దుప్పులు
Ⓓ పిట్టలు
⑧. ఎవరిని పట్టుకొనవలెనని అతనికి కీడు చేయనాలోచించువారు గుంటలో తమ "వల" నొడ్డిరి?
Ⓐ దావీదును
Ⓑ యోబును
Ⓒ హిజ్కియాను
Ⓓ నాతానును
⑨. "వల"ఎవరిని చిక్కించుకొనునని బిల్డదు అనెను?
Ⓐ మూర్ఖులను
Ⓑ భక్తిహీనులను
Ⓒ వ్యర్ధులను
Ⓓ మూఢులను
①⓪. తాము ఒడ్డిన "వలలో"జనముల ఏమి చిక్కుబడి యున్నది?
Ⓐ తల
Ⓑ చేయి
Ⓒ కాలు
Ⓓ దేహము
①①. ఎవరితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు "వల"వేయువాడు?
Ⓐ తన స్నేహితునితో
Ⓑ తన సహోదరునితో
Ⓒ తన పొరుగువానితో
Ⓓ తన బంధువునితో
①②. ఏ పట్టణము "వలలు"పరచుటకు చోటగును?
Ⓐ తూరు
Ⓑ మోయాబు
Ⓒ ఎదోము
Ⓓ అష్షూరు
①③. ఏ దేశము వారు జలముల మీద "వలలు"వేసి కృశించిపోవుదురు?
Ⓐ సీదోను
Ⓑ ఐగుప్తు
Ⓒ తర్షీషు
Ⓓ సీనీయ
①④. ప్రతి మనుష్యుడు ఏమై తన సహోదరుని కొరకు "వలలను"ఒగ్గును?
Ⓐ ద్రోహియై
Ⓑ మోసకారియై
Ⓒ కిరాతుడై
Ⓓ దుర్మార్గుడై
①⑤. దేవుడు తన "వలలో"నన్ను చిక్కించుకొనెనని ఎవరు అనెను?
Ⓐ దావీదు
Ⓑ యాకోబు
Ⓒ యిర్మీయా
Ⓓ యోబు
Result: