1. ఏది యెహోవా కాళ్ళు కడుగుకొను "పళ్ళెము"?
2 . ఏమి యను "చీపురుకట్ట"తో యెహోవా బబులోనును తుడిచివేయును?
3 . ఎగిరిపోవు "పుస్తకమొకటి" ఎవరికి కనబడెను?
4 . ఒక స్త్రీ ఎవరితల మీద "తిరుగటిమీదరాతిని"పడవేయగా అతని కపాలము పగిలెను?
5 . కానాలో వివాహము జరిగిన ఇంటిలో ఎన్ని "రాతిబానలు"యుండెను?
6. దేని మీదకు నా "చెప్పు"విసిరివేయుదునని యెహోవా అనెను?
7 . ఎవరి శిష్యుని యింటిలో "నూనెకుండ" ఒకటి యుండెను?
8 . ఎవరు ధనవంతుని "బల్ల"మీద నుండి పడిన రొట్టెముక్కలను తినుచునుండెను?
9 . ఎవరి తలగడ దగ్గర నున్న "నీళ్ళబుడ్డి"ని తీసుకొని దావీదు వెళ్ళిపోయెను?
10 . ఎవరు "గిన్నెయు" పళ్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని వారి అంతరంగము దోపు చెడుతనముతో నిండియుండెనని యేసు చెప్పెను?
11. "గొడ్డలి "ఎక్కడ యుంచబడి యున్నదని యోహాను అనెను?
12 . నాతో కూడా "పాత్రలో" చెయ్యి ముంచిన వాడే నన్ను అప్పగించువాడని యేసు ఎవరి గురించి అనెను?
13 . యెహోవా యొక్క "దుడ్డుకర్ర, దండము" మనలను ఏమి చేయును?
14 . యెహోవా ఎవని "సబ్బు" వంటివాడు?
15 . యెహోవా మాట దేనిని బద్దలు చేయు "సుత్తె" వంటిది?
Result: