1. ఆదియందు దేవుని యొద్ద నున్న వాక్యము ఎవరు?
2 . వాక్యము ఏమియై కృపాసత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను?
3 . దేవుని వాక్యము దేని వలె నుండును?
4 . వాక్యమైన క్రీస్తు ఉదయకాలపు దేని వలె నుండును?
5 . వాక్యము దేని మీద పడు చినుకుల వలె నుండును?
6. ఏమి లేకుండా ఉదయించు సూర్యుని వలె వాక్యమనే క్రీస్తు ఉండును?
7 . వాక్యము దేని మీద కురియు వర్షము వలె నుండును?
8 . వాక్యమనే క్రీస్తు ఎటువంటి కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె నుండును?
9 . దేవుని వాక్యము చేత యౌవనస్థులు తమ యొక్క దేనిని శుద్ధిపరచుకొందురు?
10 . దేవుని వాక్యము సజీవమై దేని యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది?
11. వాక్యము బాధలో ఏమి కలిగించుచున్నది?
12 . వాక్యమనే క్రీస్తు యొక్క దేనిలో నుండి కృప వెంబడి కృప పొందితిమి?
13 . వాక్యమనే క్రీస్తు ఎవరిని రక్షించుటకు లోకమునకు వచ్చెను?
14 . వాక్యముతో ఉదకస్నానము చేత దేనిని పరిశుద్ధపరచుటకు క్రీస్తు తన్నుతాను అప్పగించుకొనెను?
15 .వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు ఏమియైనదియునై యున్నది?
Result: