1. పరిశుద్ధగ్రంధములో ఎన్ని "వాగ్దానములు"కలవు?
2. మనుష్యజాతికి దేవుడిచ్చిన "వాగ్ధానములు"ఎన్ని?
3. దేవుడు ఎవరికి చేసిన "వాగ్ధానము"ఆతిముఖ్యమైనది?
4. "వాగ్ధానము"చేసినదేవుడు నమ్మదగినవాడు గనుక దేని విషయమై మనమొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము?
5. దేవుని "వాగ్దానములు"ఎన్నియైనను ఆవి ఎవరియందు అవునన్నట్టుగానే యున్నవి?
6. ఆత్మను గూర్చిన "వాగ్ధానము"దేని వలన మనకు లభించును?
7. దేవుడు యేసును గూర్చిన వేటిని బట్టి మనకు అమూల్యములునైన "వాగ్ధానములను"అనుగ్రహించియుండెను?
8. "వాగ్దానములను"పొందిన అబ్రాహామును ఆశీర్వదించినదెవరు?
9. నిరీక్షణను చేపట్టుటకు ఏమైన మనకు ధైర్యము కలుగునట్లు దేవుడు "వాగ్ధానమును"ధృఢపరచెను?
10. దేవుడు యాకోబునకు ఇచ్చిన "వాగ్దానము" ఏ ప్రవక్త ద్వారా ప్రవచింపజేసెను?
11. విశ్వాసము ఓర్పు చేతను "వాగ్ధానములను" ఏమి చేయువారిని పోలి నడుచుకొనవలెను?
12. మనమును ఎవరి వలె "వాగ్దానమును", బట్టి పుట్టిన కుమారులమై యున్నాము?
13. మనద్వారా దేవునికి ఏమి కలుగుటకై "వాగ్ధానములు"క్రీస్తు వలన నిశ్చయములై యున్నవి?
14. పిలువబడినవారు దేనిని గూర్చిన "వాగ్దానమును"పొందు నిమిత్తము క్రీస్తు క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యుండెను?
15. దేవుని యొక్క దేనిలో ప్రవేశించుదుమనే "వాగ్దానము" ఇంకా నిలిచియుండెను?
Result: