Telugu Bible Quiz Topic wise: 761 || తెలుగు బైబుల్ క్విజ్ ( "వాడి" అనే అంశముపై క్విజ్ )

1. ఎవరు "వాడి" గల రాయిని తీసుకొని తన కుమారునికి సున్నతి చేసెను?
ⓐ హన్నా
ⓑ నయోమి
ⓒ సిప్పోరా
ⓓ జిబ్యా
2. ఎవరు కత్తి "వాడి"చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను?
ⓐ హూరు
ⓑ ఆహరోను
ⓒ ఎలియాజరు
ⓓ యెహొషువ
3. యెహోవా నా నోరును "వాడి"గల దేనిగా చేసియున్నాడని యాకోబు అనెను?
ⓐ కరవాలముగా
ⓑ ఖడ్గముగా
ⓒ కత్తిగా
ⓓ బాణముగా
4. తన పొరుగువాని మీద ఏమి పలుకువాడు "వాడి"గల అంబును పోలియున్నాడు?
ⓐ అబద్ధసాక్ష్యము
ⓑ మోసకరసాక్ష్యము
ⓒ కూటసాక్ష్యము
ⓓ దొంగసాక్ష్యము
5. యెహోవా వేసిన "వాడి"గల వేటి చేత జనులు కూలుదురు?
ⓐ కత్తులు
ⓑ కరవాలములు
ⓒ ఖడ్గములు
ⓓ బాణములు
6. ఏమి చేయువాని నాలుక "వాడి"గల మంగలకత్తి వలె నాశనము చేయ నుద్దేశించుచున్నది?
ⓐ అన్యాయము
ⓑ మోసము
ⓒ అధర్మము
ⓓ అక్రమము
7. ఎవరి నాలుక "వాడి"గల కత్తి?
ⓐ అహంకారుల
ⓑ కోపోద్రేకుల
ⓒ భక్తిహీనుల
ⓓ వంచకుల
8. మోసకరమైన నాలుక మీద యెహోవా ఎవరి "వాడి"గల బాణములు వేయును?
ⓐ బలాఢ్యుల
ⓑ శక్తిమంతుల
ⓒ వివేకుల
ⓓ జ్ఞానవంతుల
9. మంగలకత్తి వంటి "వాడి"గల కత్తితో యెహోవా ఎవరిని అతని తల గడ్డము క్షౌరము చేసుకొనమనెను?
ⓐ యిర్మీయాను
ⓑ యెహెజ్కేలును
ⓒ యెషయాను
ⓓ జెరూబ్బాబెలును
10. ఎవరు పాము నాలుక వలె తమ నాలుకను "వాడి"చేయుదురు?
ⓐ మూర్ఖులు
ⓑ గర్వాంధులు
ⓒ దుష్టులు
ⓓ మూఢులు
11. కుడిచేత ఏమి పట్టుకొని యున్న మనుష్యకుమారుని నోటి నుండి "వాడి"యైన ఖడ్గమొకటి బయలువెడలు చుండెను?
ⓐ చంద్రబింబమును
ⓑ అయిదు చుక్కలను
ⓒ ఏడు నక్షత్రములను
ⓓ సప్తర్షీమండలమును
12. తెల్లని మేఘము మీద ఆసీనుడైన మనుష్యకుమారుని చేతిలో "వాడి"యైన ఏమి కలదు?
ⓐ కత్తి
ⓑ బాణము
ⓒ కరవాలము
ⓓ కొడవలి
13. దేని మీద కూర్చుండియుండిన ఆయన నోట నుండి జనములను కొట్టుటకై "వాడి"గల ఖడ్గము బయలువెడలుచున్నది?
ⓐ తెల్లని గుర్రముపై
ⓑ ఎర్రని గుర్రముపై
ⓒ పాండురవర్ణగుర్రముపై
ⓓ నల్లని గుర్రముపై
14. "వాడి" యైన రెండంచుల ఖడ్గము గలవాడు ప్ర. ఏ సంఘముకు సంగతులు చెప్పుచుండెను?
ⓐ తుయతైర
ⓑ పెర్గము
ⓒ సార్థీస్
ⓓ స్ముర్న
15. దేవుని వాక్యము రెండంచులుగల ఖడ్గము కంటెను "వాడి"గా ఉండి దేని యొక్క ఆలోచనలను తలంపులను శోధించుచున్నది?
ⓐ శరీరము
ⓑ ప్రాణము
ⓒ హృదయము
ⓓ ఆత్మ
Result: