1. యెహోవా దీవించిన చేని "వాసన" వలె నా కుమారుని వాసన ఉందని ఎవరు అనెను?
2. క్రీస్తు మనలను ప్రేమించి ఎటువంటి వాసనగా యుండుటకు మనకొరకు తన్నుతాను ఆప్పగించుకొనెను?
3. ఓడలో నుండి బయటకు వచ్చిన నోవహు ఏమి కట్టి అర్పించిన ఆర్పణ దేవునికి ఇంపైన సువాసనగా నుండెను?
4. దేవుడు ఆనందతైలముతో అభిషేకించిన వస్త్రములు ఏమేమి వాసన వచ్చుచున్నవి?
5. క్రీస్తును గూర్చిన దేని యొక్క సువాసన కనుపరచాలి?
6. ఎవరు పంపిన వస్తువులు మనోహరమైన సువాసన అని పౌలు అనెను?
7. సకల గంధవర్గముల కన్న ప్రభు పరిమళ తైలము వాసన ఏమైనది?
8. యెహోవా కొరకు చేయబడిన ధూపద్రవ్యముల వంటివి చేసి వాసన చూచినవాడు ఎవరి నుండి కొట్టివేయబడును?
9. ఎవరికి మరణార్ధమైన మరణపు వాసనగా యున్నాము?
10. ఏమి పూతపట్టి సువాసన ఇచ్చుచున్నవి?
11. యెహోవాకు ఆర్పించు బలులు ఇంపైన సువాసన గల ఏమై యుండును?
12. జీవించువారికి ఏదైనా జీవపువాసనగా యున్నాము?
13. అగ్నిగుండములో వేయబడిన ఎవరి వస్త్రములు అగ్నివాసన లేకుండా యుండెను?
14. ఎవరి విగ్రహములు ముక్కులుండియు వాసన చూడవు?
15. షూలమ్మితీ వస్త్రముల సువాసన దేని సువాసన వలె నున్నది?
Result: