1 Q. యాజకుడై అహరోను కుమారుడగు ఎవరు పరిశుద్ధస్థలమును కాపాడు వారిమీద విచారణకర్త?
2 Q. ఫరో తన యింటిమీద "విచారణకర్త" గా ఎవరిని నియమించెను?
3 Q. ఎవరి యొద్ద ధర్మ శాస్త్ర "విచారణ" చేయవలెను?
4. నన్ను గూర్చి ఏవిధముగా "విచారణ" చేయునెడల మీరు నన్ను కనుగొందురని యెహోవా సెలవిచ్చెను?
5 Q. ఒకడు దేవుని యొద్ద "విచారణ" చేసి పొందిన ఆలోచనయైనట్టుగా ఎవరి ఆలోచన ఉండెను?
6 Q. ఏ పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాయొద్ద "విచారణ" చేసెను?
7Q. కర్ణ పిశాచముగల యొక స్త్రీని కనుగొనుడి; నేను పోయి దానిచేత "విచారణ" చేతునని ఎవరు తన సేవకులకు ఆజ్ఞ ఇచ్చెను?
8 Q. నేడు యెహోవా యొద్ద "విచారణ" చేయుదము రండని ఇశ్రాయేలు రాజుతో ఎవరు అనెను?
9 Q. ఎవరు తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను "విచారణ చేయుదురు?
10. షద్రకు మేషాకు అబేద్నెగోయను వారు ఏ సంస్థానము మీద "విచారణ" కర్తలుగానుండిరి?
11Q. యెహోవాయొద్ద "విచారణ" చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ' చేయుదానిని వెదకినందుకును సౌలు ఏమాయెను?
12.ఒకడు దేనిలోనికి రాకముందు బహుకాలము అతనిని "విచారణ" చేయుట దేవునికి అగత్యము లేదు?
13. దేనిని నీకు "విచారణ" కర్తలుగా నియమించుచున్నానని యెహోవా సెలవిచ్చెను?
14Q. దేవుడు "విచారణ" చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును? అని ఎవరు అనెను?
15Q. నేను యెహోవాయొద్ద "విచారణ" చేయగా ఆయన నాకుత్తరమిచ్చెను' అని ఎవరు అనెను?
Result: