Telugu Bible Quiz Topic wise: 768 || తెలుగు బైబుల్ క్విజ్ ( "విచిత్రమైన" అనే అంశముపై క్విజ్ )

1. ఎవరికి యాకోబు "విచిత్రమైన" నిలువుటంగీ కుట్టించెను?
ⓐ యోసేపునకు
ⓑ బెన్యామీనునకు
ⓒ రూబేనుకు
ⓓ యూదాకు
2. విచిత్రమైన పనులు కల్పించుటకు యెహోవా ఎవరిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసెను?
ⓐ హూరును
ⓑ బెసలేలును
ⓒ ఆదాయాను
ⓓ ఎల్మెతెకును
3. విచిత్రమైన చొక్కాయి ఎవరికి కుట్టవలసిన వస్త్రము?
ⓐ ప్రధానులకు
ⓑ న్యాయాధిపతులకు
ⓒ యాజకులకు
ⓓ పెద్దలకు
4. దేని మీద నుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై యుండవలెను?
ⓐ చొక్కాయి
ⓑ పతకము
ⓒ ముద్ర
ⓓ ఏఫోదు
5. ఏఫోదు విచిత్రమైన నడికట్టును ఎవరికి కట్టుమని యెహోవా సెలవిచ్చెను?
ⓐ అహరోనుకు
ⓑ మిర్యాముకు
ⓒ హోబాబుకు
ⓓ హూరునకు
6. విచిత్రమైన పని కల్పించువాడు బుటా పని చేయువాడైన అహోలీయాబు ఏ గోత్రికుడు?
ⓐ యూదా
ⓑ దాను
ⓒ ఆషేరు
ⓓ నఫ్తాలి
7. ఎన్ని బంగారు ఉంగరములను విచిత్రమైన నడికట్టుకు పైగా దాని రెండవ కూర్పు నొద్ద వేసిరి?
ⓐ మూడు
ⓑ నాలుగు
ⓒ రెండు
ⓓ అయిదు
8. ఎవరు గొడ్డళ్ళను సమ్మెటలను చేత పట్టుకొని విచిత్రమైన పనిని బొత్తిగా విరుగగొట్టును?
ⓐ విరోధులు
ⓑ వైరులు
ⓒ చోరులు
ⓓ శత్రువులు
9. విచిత్రమైన నార దుప్పట్లు ఏ దేశములో కలవు?
ⓐ అష్షూరు
ⓑ మోయాబు
ⓒ ఐగుప్తు
ⓓ ఎదోము
10. ఎవరు విచిత్రమైన పని గల చౌకపు తుండు తీసికొని అమ్ముదురు?
ⓐ యూదావారు
ⓑ గ్రేకేయులు
ⓒ అరబీయులు
ⓓ దదాను వారు
11. ఎవరి తెరచాపలు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసె నారబట్టతో చేయబడును?
ⓐ కూషు
ⓑ తుబాలు
ⓒ తూరు
ⓓ సిరియ
12. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజకుమారి ఎక్కడ నుండి రాజు నొద్దకు తీసుకొని రాబడుచున్నది?
ⓐ దక్షిణ దేశము
ⓑ అంత:పురము
ⓒ రాజనగరు
ⓓ స్వదేశము
13. విచిత్రమైన కుట్టు పనిగల బట్టలను యెహోవా ఎవరికి ధరింపజేసెను?
ⓐ యెరూషలేమునకు
ⓑ యూదా రాజులకు
ⓒ షోమ్రోను రాజులకు
ⓓ ఇశ్రాయేలు వారికి
14. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు ఎవరి మంచము లోపలి భాగమును అలంకరించిరి?
ⓐ దావీదు
ⓑ యాకోబు
ⓒ సొలొమోను
ⓓ సమ్సోను
15. ప్రియుడైన క్రీస్తు యొక్క ఏమి విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది?
ⓐ చెక్కిళ్లు
ⓑ నేత్రములు
ⓒ కరములు
ⓓ కాయము
Result: