1Q. "నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి యున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు" పై వాక్యము యొక్క రిఫరెన్స్ చెప్పండి?
2 Q. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము; ఆ పట్టణముమీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ(యెహోవా) వేటినిబట్టి దానియేలు విజ్ఞాపనము చేసెను?
3Q. ఎవరి నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండవలెను?
4Q. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను వేటిచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి?
5Q. "యెహోవా, నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము" ఎవరు యెహోవాతో ఈలాగు మనవి చేసెను?
6Q. ఎవరు దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచినదానినిబట్టి వారు చేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి?
7Q. నీ ప్రేమను గూర్చియు, ప్రభువైన యేసు యెడలను, సమస్త పరిశుద్ధులయెడలను నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్ధనలయందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచున్నాను. అని అపొస్తలుడైన పౌలు ఎవరితో అనెను?
8Q. ఎవరు తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున,విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు?
9 Q. ఎవరు కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసేను?
10Q. యెహోవా దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఎవరిని విడిచి పోయెను?
11 Q. అనాథయైన విధవరాలు ఏకాకియైయుండి, దేవుని మీదనే నిరీక్షణనుంచుకొని, విజ్ఞాపనలయందును ప్రార్థనలయందును రేయింబగలు ఏ విధంగా ఉండును?
12 Q. భీతిచెందినవాడనై నీకు(యెహోవాకు ) కనబడకుండ నేను(దావీదు) నాశనమైతినని, నీకు నేను మొఱ్ఱపెట్టగా నీవు నా వేటిని ఆలకించితివి?
13Q. ఎస్తేరు రాణీ, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకనుగ్రహింపబడును. అని ఎవరు అడిగెను?
14Q. ఎవరు గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట మనస్సును నిబ్బరము చేసికొనెను?
15. ప్రార్ధనచేయుచు దేనికొరకు నా దేవుడైన యెహోవా యెదుట నా పాపమును నా జనముయొక్క పాపమును ఒప్పుకొనుచు విజ్ఞాపన చేయుచుంటిని అని దానియేలు పలికెను.?
Result: