1Q. యెరూషలేము ప్రాకారములు కాల్చబడెనని వినిన ఎవరు ఆకాశమందలి దేవునికి "విజ్ఞాపన"చేసెను?
2. ఎవరు "విజ్ఞాపన"చేసి ప్రవచించెను?
3 ప్ర.తాము ఏమియై తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి ఇశ్రాయేలీయులు చేయు రోదన "విజ్ఞాపనములు"వినబడుచున్నవి?
4 ప్ర.గ్రంధము కాల్చవద్దని ఎల్నాతానును దెలాయ్యాయు గెమర్యాయు మనవి చేసినను ఏ రాజు వారి "విజ్ఞాపనము"వినకపోయెను?
5 ప్ర. నీ " విజ్ఞాపన" ఏమిటి? అని రాజు ఎవరిని అడిగెను?
6 ప్ర. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను "విజ్ఞాపన"చేయు దేనిని యెహోవా కుమ్మరించెను?
7 ప్ర. నీవు "విజ్ఞాపనము"చేయ నారంభించినప్పుడు సంగతిని నీకు చెప్పుటకు నాకు ఆజ్ఞ బయలు దేరెనని ఎవరు దానియేలుతో అనెను?
8 . దీనివైపునకు నేను చేతులెత్తినపుడు నా "విజ్ఞాపనల"ధ్వని ఆలకించితివని దావీదు యెహోవాతో అనెను?
9 ప్ర. మనుష్యులు రాజులు అధికారులందరి కొరకు "విజ్ఞాపనము"లను చేయవలెనని పౌలు ఎవరిని హెచ్చరించెను?
10ప్ర. దేనితో కూడిన ఓర్పును కలిగిన సంఘమును జ్ఞాపకము చేసుకొని వారి కొరకు పౌలు "విజ్ఞాపనము చేయుచుండెను?
11. ప్రతి విషయములోను ప్రార్ధన "విజ్ఞాపనముల"చేత కృతజ్ఞతాపూర్వకముగా ఏమి దేవునికి తెలియజేయవలెను?
12 ప్ర. ఎవరి "విజ్ఞాపన"మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును?
13 ప్ర. ఏమి చేసిన వారి గురించి క్రీస్తు "విజ్ఞాపనము"చేసెను?
14. ఎలా "విజ్ఞాపన"చేయుచు మెలకువగా ఉండవలెను?
15 ప్ర. ప్రభువైన క్రీస్తు దేవుని చిత్తప్రకారము ఎవరి కొరకు "విజ్ఞాపనము చేయుచుండెను?
Result: