1ప్ర. యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవుచున్నాడు గనుక ఈ చోటును "విడచి" పెట్టి రండని ఎవరు తన అల్లుళ్లతో అనెను?
2 . ఏది అధికము కాకమునుపే దాని "విడచి"పెట్టవలెను?
3 ప్ర. వేటిని "విడచి"నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనవలెను?
4ప్ర. యెహోవాను "విడచి" వేరొకని అనుసరించువారికి ఏమి విస్తరించును?
5Q. పితృపారంపర్యమైన వ్యర్థప్రవర్తనను "విడచి"పెట్టునట్లుగా వెండిబంగారము వంటి వేటిచేత మనము విమోచింపబడలేదు?
6. ఏమి "విడచిన"వాని మార్గములు వానికే వెక్కసమగును?
7Q . ఎవరు యిహలోకమును స్నేహించి పౌలును "విడచి"పెట్టెను?
8ప్ర. వివేక మార్గము "విడచి"తిరుగువాడు ఎక్కడ కాపురముండును?
9ప్ర. ఎవరు చెడుతనము "విడచి"మనస్సు త్రిప్పుకొనిన దినమున తాను చేసియున్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు?
10 ప్ర. మార్గము " విడచిన" వానికి ఏమి కలుగును?
11. ఏమి తొలగిపోయినను యెహోవా కృప మనలను "విడచి"పోదు?
12 . ఏమి "విడచి"జీవముగల దేవుని సేవించిన యెడల క్రీస్తు రక్తము మన మనస్సాక్షిని శుద్ధిచేయును?
13ప్ర. దయను సత్యమును "విడచి"పెట్టక వాటిని ఎలా ధరించుకొనవలెను?
14. అతిక్రమములను ఒప్పుకొని "విడచి"పెట్టువాడు ఏమి పొందును?
15. ప్రియుడైన క్రీస్తు తన ప్రాణేశ్వరిని దేనిని "విడచి" తనతో రమ్మనెను?
Result: