1Q. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, అని ఎవరు సెలవిచ్చుచున్నాడు?
2Q. వేటిని ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము?
3Q. యెహోవాను విడచి వేరొకని అనుసరించువారికి ఏమి విస్తరించును?
4Q. ఎవరు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసివేసెను?
5Q. ఏమి విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును?
6. నీతిమంతుడు తన నీతిని విడిచి, పాపము చేసిన యెడల ఆ పాపమునుబట్టి అతడు ఏమి నొందును?
7Q. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము, అది నీకు ఏమైయుండెను?
8Q. యేసు - నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి.. సిలువలో యేసు పలికిన ఏడు మాటల్లో ఈ మాట ఎన్నవది?
9Q. ఎవరు దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు?
10Q. దేనియందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు?
11: సంతోషము మా హృదయమును విడిచిపోయెను, ఏది దుఃఖముగా మార్చబడియున్నది?
12Q. నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన దేనిని విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి?
13Q. ఏమైయున్న నన్ను నా (యెహోవా)జనులు విడిచి యున్నారు?
14Q. దేనిని విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును?
15Q. నీవు దేనిని విడిచినయెడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసెదవు?
Result: