① ఎన్నవ సంవత్సరాంతమున "విడుదల" ఇయ్యవలెను?
② ఎవరికి "విడుదల" మరియొక దిక్కు నుండ వచ్చునని మొర్ధికై ఎస్తేరుతో అనెను?
③ బరబ్బానా? క్రీస్తనబడిన యేసునా?నేనెవరిని "విడుదల"చేయవలెనని మీరు కోరుచున్నారని ఎవరు జనసమూహమును అడిగెను?
④ నిన్ను "విడుదల"చేయుటకు నాకు ఏమి కలదని పిలాతు యేసుతో అనెను?
⑤ చెరలో నున్న వారికి "విడుదల"ప్రకటించుటకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చెనని ఎవరు అనెను?
⑥ భర్త చనిపోయిన స్త్రీ అతని విషయమైన దేని నుండి "విడుదల"పొందును?
⑦ యేసు నామమును బట్టి బోధింపకూడదని ఎవరిని ప్రధానయాజకుడు అతనితో నున్న వారు కొట్టి వారిని "విడుదల"చేసిరి?
⑧ ఉదయమైనప్పుడు ఎవరు పౌలును సీలను "విడుదల"చేయుమని చెప్పుటకు బంటులను పంపిరి?
⑨ ఇశ్రాయేలీయులు నీకు మొర్రపెట్టి "విడుదల" నొందిరని ఎవరు యెహోవాతో అనెను?
①⓪. యెహోవా ఎవరిని "విడుదల"చేయువాడని కీర్తనాకారుడు అనెను?
①① సభవారు ప్రజలకు భయపడి ఎవరిని గట్టిగా బెదరించి "విడుదల"చేసిరి?
①② ఈ హేయక్రియలన్నియు జరిగించుటకేనా మీరు "విడుదల"నొందితిరి? అని యెహోవా మాట ఇశ్రాయేలీయులకు ఏ ప్రవక్త చెప్పెను?
①③ ఎన్ని సంవత్సరముల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన స్త్రీతో నీవు "విడుదల"పొందియున్నావని యేసు చెప్పెను?
①④ నిర్బందింపబడిన దాని విషయమై ఏమైనవారమై ధర్మశాస్త్రము నుండి "విడుదల"పొందితిమి?
①⑤ మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి దేవుడు "విడుదల"చేసెనని పౌలు ఏ సంఘముతో అనెను?
Result: