Telugu Bible Quiz Topic wise: 777 || తెలుగు బైబుల్ క్విజ్ ( "విద్య" అనే అంశముపై క్విజ్-1 )

1. ఏమి గల మాటలు పలుకుట వలన "విద్య" యెక్కువగును?
ⓐ రుచి
ⓑ తెలివి
ⓒ యుక్టి
ⓓ శక్తి
2. జ్ఞానుని యొక్క ఏమి వాని పెదవులకు "విద్య" విస్తరింపజేయును?
ⓐ మనస్సు
ⓑ హృదయము
ⓒ నీతి
ⓓ వివేచన
3. ఏమైన వాడు తన"విద్యను" దాచిపెట్టును?
ⓐ జ్ఞాని
ⓑ తెలివైన
ⓒ బుద్ధిగల
ⓓ వివేకి
4. ఐగుప్తీయుల సకల "విద్యలను" అభ్యసించినదెవరు?
ⓐ ఎఫ్రాయిము
ⓑ యోసేపు
ⓒ మనషే
ⓓ మోషే
5. జ్ఞానమను "విద్యను" పూర్తిగా అభ్యసించితినని అనుకొనినదెవరు?
ⓐ ఎజ్రా
ⓑ దావీదు
ⓒ ప్రసంగి
ⓓ ఉజ్జీయా
6. ఎవరి కుమారులు విలు" విద్య" యందు ప్రవీణులు?
ⓐ రెహబాము
ⓑ ఊలాము
ⓒ అబ్షాలోము
ⓓ యోతాము
7. ఎవరి రాజవంశముల వారు సకల "విద్యా" ప్రవీణులైయున్నారు?
ⓐ ఐగుప్తీయుల
ⓑ ఇశ్రాయేలీయుల
ⓒ సీదోనీయుల
ⓓ సినీయుల
8. విస్తారముగా "విద్యాభ్యాసము" చేయుట దేనికి ఆయాసకరము?
ⓐ మనస్సునకు
ⓑ దేహమునకు
ⓒ హృదయమునకు
ⓓ శరీరమునకు
9. అధిక "విద్య" సంపాదించిన వానికి ఏమి కలుగును?
ⓐ అధికధనము
ⓑ అధిక తెలివి
ⓒ అధికశోకము
ⓓ అధిక మేలు
10. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులైన వారికి కల్దీయుల "విద్యను" నేర్పమని నెబుకద్నెజరు ఎవరితో చెప్పెను?
ⓐ అప్పెనజునకు
ⓑ హేగేకు
ⓒ హెర్మోజునకు
ⓓ యెరెజునకు
11. ఎవరిని వెనుకకు త్రిప్పి వారి "విద్యను" అవిద్యగా చేయువాడను నేనే అని యెహోవా అనెను?
ⓐ సోదెకాండ్రను
ⓑ జ్ఞానులను
ⓒ ప్రగల్బులను
ⓓ వదరుబోతులను
12. కన్యకయైన ఎవరితో, నీ "విద్య" నిన్ను చెరిపివేసెనని యెహోవా అనెను?
ⓐ ఎదోముతో
ⓑ తర్షీషుతో
ⓒ బబులోనుతో
ⓓ మోయాబుతో
13. గారడీ "విద్య "గల వారి కంటెను ఎంత శ్రేష్టులని దానియేలు హనన్యా మిషాయేలు అజర్యాల గురించి తెలియబడెను?
ⓐ ఐదంతలు
ⓑ ఇరువదంతలు
ⓒ యేడంతలు
ⓓ పదియంతలు
14. ఎవరు యేసుక్రీస్తును గూర్చి ప్రకటింపగా మాంత్రిక "విద్య" నభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములను కాల్చివేసిరి?
ⓐ ఫిలిప్పు
ⓑ యాకోబు
ⓒ పౌలు
ⓓ అంద్రెయ
15. ఎవరి యొక్క ధైర్యమును చూచి వారు "విద్య" లేని పామరులని గ్రహించి అందరు ఆశ్చర్యపడిరి?
ⓐ పేతురు; యోహానుల
ⓑ బర్నబా; సీలల
ⓒ మార్కు; ఫిలిప్పుల
ⓓ తీతు ; తిమోతిల
Result: