1Q. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటె ఏమి వినుటయు శ్రేష్ఠము?
2 . సొలొమోను హృదయమందు దేవుడు ఉంచిన వేటిని "వినుటకై" లోకులందరును అతని చూడగోరిరి?
3 Q. ఎవరి పాటలు వినుటకంటె జ్ఞానుల గద్దింపు "వినుట" మేలు?
4. అపొస్తలులు - మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని, మీరు "వినుటకు" ఏమైనందున వాటిని విశదపరచుట కష్టము?
5.వినుట వలన ఏమి కలుగును?
6Q. విశ్రాంతిదినమున పట్టణ మంతయు ఏమి "వినుటకు" కూడివచ్చెను?
7. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని "వినుట"కంటె నాకు ఎక్కువైన సంతోషము లేదని ఎవరు ఎవరికి చెప్పెను?
8 Q. గల్లియోను - యూదులారా, యిదియొక అన్యాయము గాని చెడ్డ నేరము గాని యైనయెడల నేను మీమాట ఏవిధముగా "వినుట" న్యాయమే?
9. ప్రజలందరు యేసు మాట "వినుటకు" దేవాలయములో ఆయనయొద్దకు ఎలా వచ్చుచుండిరి?
10Q. నా మనవి "వినుటకై" నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నానని ఎవరు పలికెను?
11. సొలొమోను - నా ప్రియుని మాట "వినుట"తోనే నా ప్రాణము -----?
12Q. నేను "వినుటకై" ఆయన(యెహోవా) ప్రతి ఉదయమున నాకు విను బుద్ది పుట్టించుచున్నాడని ఎవరు పలికెను?
13Q. యెహోవా, ఇశ్రాయేలీయులతో -మీ పాటల ధ్వని నాయొద్దనుండి తొలగనియ్యుడి, ఏది "వినుట" నాకు మనస్సులేదు?
14. అపొస్తలులు - మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని, మీరు "వినుటకు" ఏమైనందున వాటిని విశదపరచుట కష్టము?
15Q. ప్రధాన యాజకులకును శాస్త్రులుకును ఆ ప్రజలలో ప్రధానులకు అ పైవారందరికి ప్రతి మనుష్యుడు వినుటకు ఏవిధముగా యుండవలెను?
Result: