Telugu Bible Quiz Topic wise: 780 || తెలుగు బైబుల్ క్విజ్ ( "విభ్రాంతి" అనే అంశముపై క్విజ్ )

1. "విభ్రాంతి"చేత నేను చూడలేకుండ నున్నాను అని ఎవరు అనెను?
Ⓐ దానియేలు
Ⓑ యెషయా
Ⓒ యిర్మీయా
Ⓓ యెహెజ్కేలు
2. పాడు దిబ్బలైన ఏమిగల పట్టణములలోని కాపురస్థులు బలహీనులై "విభ్రాంతి"నొంది పొలములోని గడ్డివలె ఆయెను?
Ⓐ గోపురములు
Ⓑ కోటలు
Ⓒ ప్రాకారములు
Ⓓ పర్వతములు
3. ఎవరి తల్లియైన మరియ యింటిలో ప్రార్ధన చేయుచుండినవారు పేతురును చూచి "విభ్రాంతి"నొందిరి?
Ⓐ యేసు
Ⓑ యాకోబు
Ⓑ ఫిలిప్పు
Ⓓ యోహాను
4. ఏ పండుగదినమున కూడియున్న అందరు పరిశుధ్ధాత్మతో నిండినవారై తమ స్వభాషతో మాటలాడగా జనులు "విభ్రాంతి"నొందిరి?
Ⓐ పెంతెకొస్తు
Ⓑ పస్కా
Ⓒ అమావాస్య
Ⓓ గుడారముల
5. సీమోను అను గారడీ చేయుచు ఏ జనులను "విభ్రాంతి"పరచుచుండెను?
Ⓐ గలిలయ
Ⓑ బెరయ
Ⓒ సమరయ
Ⓓ ఈకొనియ
6. సమరయవారు ఎప్పటినుండి గారడీలు చేయుచు "విభ్రాంతి"పరచుచున్న సీమోను మీద లక్ష్యముంచిరి?
Ⓐ బాల్యకాలము
Ⓑ బహుకాలము
Ⓒ దీర్ఘకాలము
Ⓓ చిరకాలము
7. తమను చూచి "విభ్రాంతి"నొంది యెటుతోచక యున్న వారితో మాటలాడినదెవరు?
Ⓐ యోహాను
Ⓑ యాకోబు
Ⓒ తోమా
Ⓓ పేతురు
8. సూచకక్రియలను గొప్పఅద్భుతములను చేయుచున్న ఎవరిని చూచి "విభ్రాంతి"నొందిన సీమోను అతని ఎడబాయకుండెను?
Ⓐ పేతురును
Ⓑ ఫిలిప్పును
Ⓒ యాకోబును
Ⓓ యోహానును
9. పేతురుతో వచ్చిన ఎవరు అన్యజనుల మీద పరిశుధ్ధాత్మ కుమ్మరింపబడుట చూచి "విభ్రాంతి"నొందిరి?
Ⓐ విశ్వాసులు
Ⓑ సహోదరులు
Ⓒ బంధువులు
Ⓓ సేవకులు
10. నిన్ను బట్టి ద్వీపనివాసులందరు "విభ్రాంతి"నొందుదురని యెహోవా ఏ పట్టణము గూర్చి అనెను?
Ⓐ ఎదోము
Ⓑ మోయాబు
Ⓒ తూరు
Ⓓ సీదోను
11. ఎవరు "విభ్రాంతి" నొందుదురని యెహోవా అనెను?
Ⓐ రాజులు
Ⓑ యాజకులు
Ⓒ ప్రవక్తలు
Ⓓ అధిపతులు
12. యెహోవా దినమున "విభ్రాంతి" నొందిన జనులకు ఏమి కలుగును?
Ⓐ శ్రమలు ప్రలాపములు
Ⓑ రోదనలు భయములు
Ⓒ వేదనలు దు:ఖములు
Ⓓ విలాపములు బాధలు
13.ఏ వ్యాధిగల వానిని యేసు స్వస్థపరచగా వాడు లేచి పరుగెత్తుట చూచిన జనులు "విభ్రాంతి"నొందిరి?
Ⓐ పక్షవాయువు
Ⓑ జలోదర
Ⓒ కుష్టు
Ⓓ ఊచకాళ్ళు
14. యేసు ఎప్పుడు సముద్రము మీద నడుచుచు శిష్యుల యొద్దకు వచ్చినప్పుడు గాలి అణగగా వారు మిక్కిలి"విభ్రాంతి"నొందిరి?
Ⓐ రాత్రి మూడవజామున
Ⓑ తెల్లవారు వేకువజామున
Ⓒ రాత్రినాలుగవజామున
Ⓓ అర్ధరాత్రిసమయమున
15. యేసు ఏమి పొంది వచ్చినప్పుడు జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల"విభ్రాంతి"నొందిరి?
Ⓐ బాప్తిస్మము
Ⓑ హస్తనిక్షేపణ
Ⓒ సున్నతి
Ⓓ రూపాంతరము
Result: