Telugu Bible Quiz Topic wise: 782 || తెలుగు బైబుల్ క్విజ్ ( "విమోచన" అనే అంశము పై క్విజ్ )

1. "విమోచనము"అనగా ఏమిటి?
ⓐ పాపక్షమాపణ
ⓑ మారుమనస్సు
ⓒ బాప్తిస్మము
ⓓ ఒప్పుకోలు
2. "విమోచన" అను పదము పరిశుద్ధగ్రంధములో ఎన్నిసార్లు కలదు?
ⓐ నూట యాబది
ⓑ నూట నలువది యేడు
ⓒ నూట ముప్పది ఆరు
ⓓ నూట అరువది రెండు
3. దేవుని యొక్క దేనిని బట్టి క్రీస్తు రక్తము వలన మనకు "విమోచనము"కలిగెను?
ⓐ కృపావాత్సల్యమును
ⓑ కృపాబాహుళ్యమును
ⓒ కృపా మహాదైశ్వర్యమును
ⓓ కృపాకనికరమును
4. క్రీస్తు "విమోచన"దేనిగా తన్నుతానే సమర్పించుకొనెను?
ⓐ ప్రతిఫలముగా
ⓑ పరిహారముగా
ⓒ విలువగా
ⓓ క్రయధనముగా
5. యెహోవా యొద్ద ఎటువంటి "విమోచన"దొరుకును?
ⓐ సంపూర్ణ
ⓑ గొప్పదైన
ⓒ విలువైన
ⓓ మంచిదైన
6. దేవుని మూలముగా క్రీస్తు మన "విమోచనము"ఆయెనని పౌలు ఏ సంఘముతో చెప్పెను?
ⓐ కొరింథీ
ⓑ ఎఫెసీ
ⓒ ఫిలిప్పీ
ⓓ గలతీ
7. కుమారుని యందు మనకు "విమోచనము" కలుగునని పౌలు ఏ సంఘముకు తెలిపెను?
ⓐ థెస్సలోనీక
ⓑ బెరయ
ⓒ కొలొస్సీ
ⓓ ఫిలిప్పీ
8. యెహోవా తన యొక్క ఎవరికి "విమోచనము"కలుగజేయును?
ⓐ సేవకులకు
ⓑ ప్రవక్తలకు
ⓒ పరిచారకులకు
ⓓ ప్రజలకు
9. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మిన వారి ప్రాణ "విమోచన"ఎటువంటిది?
ⓐ బహుగొప్పది
ⓑ బహు వింతైనది
ⓒ బహు కష్టమైనది
ⓓ బహు భీతికలది
10. మొదటి నిబంధన కాలములో జరిగిన వేటి నుండి "విమోచనము"కలుగునట్లు క్రీస్తు మరణము పొందెను?
ⓐ తిరుగుబాటుల
ⓑ అపరాధముల
ⓒ అవిధేయతల
ⓓ సణుగుల
11. దేని యొక్క "విమోచనము"కనిపెట్టుచు మనము మూలుగుచున్నాము?
ⓐ మనస్సు
ⓑ పాపము
ⓒ దేహము
ⓓ హృదయము
12. ఏ సంవత్సరమున దాసుడు "విమోచన" క్రయధనము చెల్లించి విడుదల పొందును?
ⓐ ఉత్సవ
ⓑ పండుగ
ⓒ రాబడి
ⓓ సునాద
13. దేవుడు సంపాదించుకొనిన ప్రజలకు "విమోచనము"కలుగు నిమిత్తము ఆత్మ మన యొక్క దేనికి సంచకరవుగా ఉన్నాడు?
ⓐ భాగమునకు
ⓑ స్వాస్థ్యమునకు
ⓒ పాలునకు
ⓓ సంపాద్యమునకు
14. క్రీస్తు యేసు నందలి "విమోచనము"ద్వారా ఉచితముగా మనము ఎలా తీర్చబడుచున్నాము?
ⓐ పవిత్రులముగా
ⓑ నిర్దోషులముగా
ⓒ నీతిమంతులముగా
ⓓ నిందారహితులముగా
15. నా "విమోచకుడు"ఎవరని యోబు అనెను?
ⓐ పరిశుద్ధుడు
ⓑ నిష్కళంకుడు
ⓒ పవిత్రుడు
ⓓ సజీవుడు
Result: