1. తన సహోదరునికి "విరోధముగా" మాటలాడి తీర్పు తీర్చువాడు దేనికి వ్యతిరేకి?
2. యెహోవాకు "విరోధముగా" రూపింపబడిన ఏ ఆయుధమును -?
3. మీరు పరదేశులును, యాత్రికులునై యున్నారు గనుక, దేనికి " విరోధముగా " పోరాడు శరీరాశలను విసర్జించాలి?
4. ప్రభువు ముఖము ఎవరికి " విరోధముగా" ఉన్నది?
5. ఏమి చేయువారికి యెహోవా సన్నిధి " విరోధముగా" ఉన్నది?
6. పరిశుద్దాత్మకు "విరోధముగా" మాటలాడువారికి ఈ యుగమందైనను, రాబోవు యుగమందైనను ఏమి లేదు?
7. ఒకని మీద మీకు "విరోధ" మేమైనను కల్గియున్నయెడల మీరు ఏమి చేయునప్పుడెల్లను వానిని క్షమించాలి?
8. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును " విరోధముగా"----- -?
9. "మేము మా దేవుడైన యెహోవాకు " విరోధముగా " తిరుగుబాటు చేసిన గాని ఆయన కృపాక్షమాపణలు గల దేవుడైయున్నాడని" ఎవరు ప్రార్ధించెను?
10. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధాపరచగలడా? అని ఎవరు దేవునికి " విరోధముగా" మాటలాడిరి?
11. దేవా, కేవలము నీకే " విరోధముగా" పాపము చేసి నీ ద్రుష్టిఎదుట నేను చెడుతనము చేసియున్నాను. అని ఎవరు ప్రార్ధించెను?
12. ఎవరు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని " విరోధముగా" నిలువబడుచున్నారు?
13. ఎవరు తమచేతిని యెహోవా సింహాసనమునకు "విరోధముగా" ఎత్తిరి?
14. తండ్రి, నేను దేనికి "విరోధముగాను " నీ ఎదుట పాపము చేసితినని తప్పిపోయిన చిన్న కుమారుడు పలికెను?
15. శరీరానుసారమైన ఏది దేవునికి " విరోధమై"యున్నది?
Result: