Telugu Bible Quiz Topic wise: 786 || తెలుగు బైబుల్ క్విజ్ ( "విలువ " అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్ )

1Q. "విలువ "గల ధనమును నూనెయు ఎవరి యింటనుండును?
A రాజుల
B జ్ఞానుల
C ఘనుల
D అన్యుల
2. " విలువ" గలదానిని అర్పింపజాలని నీరసుడు దేనిని ఏర్పరచుకొనును?
A కదలని విగ్రహమును
B పుచ్చని మ్రానును
C శాశ్వత జీవమును
D లోక మహిమను
3Q. మీరు "విలువ" పెట్టి కొనబడినవారు గనుక ఎవరికి దాసులుకాకుడి?
A యాజకులకు
B మనుష్యులకు
C దేవదూతలకు
D అధికారులకు
4Q. ఎవరి మరణము యెహోవా దృష్టికి "విలువ" గలది?
A స్వార్ధప్రియుల
B అనురాగరహితుల
C యెహోవా భక్తుల
D దాసి దాసుల
5Q. "విలువ "పెట్టి కొనబడినవారు గనుక దేనితో దేవుని మహిమపరచవలెను?
A దానముతో
B మీ దేహముతో
C ధాన్యముతో
D ఐశ్వర్యముతో
6Q. మిక్కిలి "విలువ" గల అత్తరు తీసికొని ఎవరు యేసు పాదములకు పూసెను?
A తామారు
B మరియ
C రాహాబు
D కేతురా
7Q. ఇశ్రాయేలీయులలో "విలువ"కట్టినవాని యొక్క క్రయధనము ఎన్ని వెండి నాణములు?
A డెబ్బది
B ఇరువది
C ముప్పది
D యాబది
8Q. "విలువ" గల సొత్తులేవియు దేనితో సాటి కావు?
A సంపదతో
B జ్ఞానముతో
C లాభముతో
D ధైర్యముతో
9Q. మిక్కిలి "విలువ" గల ప్రాణమును ఎవరు వేటాడును?
A సన్మార్గులు
B మగనాలు
C దుర్మార్గులు
D చెలికత్తెలు
10. అబ్రాహాము సేవకుడు' ఎవరి సహోదరునికి తల్లికిని "విలువ"గల వస్తువులు ఇచ్చెను?
A రిబ్కా
B తీర్స
C ఆక్సా
D బీర్స
11: నేనును నా పశువులును నీ నీళ్లు త్రాగునెడల వాటి "విలువ" నిచ్చుకొందును' అని ఇశ్రాయేలీయులు ఎవరితో అనెను?
A కల్దీయులతో
B అర్కీయులతో
C సినీయులతో
D ఎదోమీయులతో
12. "విలువ" గల సొత్తులేవియు దేనితో సాటి కావు?
A సంపదతో
B జ్ఞానముతో
C లాభముతో
D ధైర్యముతో
13Q. యెహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల "విలువ"ను మందిరము బాగు నిమిత్తమై ఏ రాజు యాజకులకు ఇచ్చెను?
A దావీదు
B ఏలీయా
C యోహాహు
D సిద్కియా
14: పడుపు సొమ్మునేగాని కుక్క "విలువ"నేగాని దేనిగా నీ దేవుడైన యెహోవా యింటికి తేకూడదు?
A దహనబలిగా
B మ్రొక్కుబడిగా
C ఘనముగా
D ప్రియముగా
15 Q. దేవుని దృష్టికి మిగుల "విలువ" గలది ఏది?
A శరీర స్వభావము
B అంతరంగ స్వభావము
C శిక్షణా రాహిత్యం
D మూర్ఖ స్వభావము
Result: