1. ఎవరి పశువులు "విశేషమై"యున్నందున భూమి వారిని భరింపలేకపోయెను?
2. ఒకడు "విశేషమైన"మ్రొక్కుబడి చేసిన యెడల నీవు నిర్ణయించిన వెల చొప్పున చెల్లింపవలెనని యెహోవా ఎవరితో అనెను?
3. సూర్యుని క్రింద ఏమి మనుష్యులకు బహు "విశేషము"గా కలుగుచున్నది?
4. ఏది తన "విశేష"బలము చేత మనుష్యులను తప్పించజాలదు?
5. ఇతర మనుష్యుల కంటే నాకు "విశేష" జ్ఞానముండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదని ఎవరు అనెను?
6. ఎంతమంది కుమాళ్ళ కంటే నేను "విశేషమైన" వాడను కానా అని ఎల్కానా హన్నాతో అనెను?
7. తాము చూపిన "విశేషమైన"దేనిని ఎరిగినవారు ఇశ్రాయేలీయులు?
8. ఫలము ఫలించిన కొలది వేటిని ఇశ్రాయేలీయులు మరి "విశేషముగా"చేయుచు వచ్చిరి?
9 . ఏ పట్టణము కంటే నీవు "విశేషమైన" దానవా?అని దేవుడు నీనెవెతో అనెను?
10 . "విశేషముగా "ప్రవచనవరమును ఆపేక్షించుమని పౌలు ఏ సంఘముతో అనెను?
11. "విశేషముగా "విశ్వాసగృహమును చేరిన వారి యెడలను ఏమి చేయుదుము?
12. మరి "విశేషముగా"దేవుని చేత ఎరుగబడిన సంఘము ఏది?
13. ఎలా దేవుని వాక్యమును బోధించుటకు "విశేష"ధైర్యము తెచ్చుకొనవలెను?
14. జీవముతో కూడిన ఏది కలుగునట్లు దేవుడు తన "విశేష"కనికరము చొప్పున మరల జన్మింపజేసెను?
15. మనము వినిన ఏమి విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లువాటి యందు మరి "విశేష"జాగ్రత్త కలిగియుండవలెను?
Result: