1. ఎవరు తన పితరుల పారంపర్యాచారములందు విశేషాసక్తి గలిగి యుండెను?
2. ఫిలేమోను యొక్క దేనిని బట్టి పౌలునకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగెను?
3. మరి విశేషముగా జీవముగల దేవుని యందు మనము ఏమి యుంచియున్నాము?
4. మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన సంఘము ఏది?
5. ఏమి కలుగజేసిన వానిమీద పౌలు విశేషభారము మోపగోరక యుండెను?
6. విశేషముగా తన యింటివారిని సంరక్షింపలేకపోయినవాడు ఎవరి కన్నా చెడ్డవాడై యుండును?
7. సహోదరులు పౌలు యొక్క వేటి మూలముగా దేవుని వాక్యము బోధించుచు మరి విశేషధైర్యము తెచ్చుకొనిరి?
8. విశేషముగా సున్నతి సంబంధులు అవిధేయులు వదరుబోతులు ఏమి చేయువారునై యున్నారు?
9. మాయావేషముగా దీర్ఘప్రార్ధనలు చేయు ఎవరు మరి విశేషముగా శిక్ష పొందుదురని యేసు చెప్పెను?
10. విశేషముగా నా బలహీనతల యందే ఎలా అతిశయపడుదునని పౌలు అనెను?
11. ఎవరు మరి విశేషముగా ఫిలేమోనుకు ప్రియసహోదరుడుగా నుండెను?
12. ఇకమీదట నా ముఖము చూడరని పౌలు చెప్పిన మాటలకు విశేషముగా దుఃఖించినదెవరు?
13. విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని రెట్టింపు సన్మానమునకు ఎలా ఎంచవలెను?
14. విశేషముగా దేనికి చేరినవారి యెడల మేలు చేయవలెను?
15. దేవుడు పౌలు చేత విశేషమైన ఏమి చేయించెను?
Result: