1Q. నీతిమంతుడు దేని మూలముగ బ్రదుకును?
2Q. అందుకు యేసు అమ్మా, నీ "విశ్వాసము" గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె యేమినొందెను?
3Q. క్రీస్తుయేసు రక్తమునందలి "విశ్వాసము"ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు "విశ్వాసము" గలవానిని ఎలా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను?
4Q. ఎవరు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరుగుదుము.?
5 Q. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ "విశ్వాసము" ఈ శోధనలచేత దేనికి నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణ మగును?
6Q. "విశ్వాసము" నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది యేమిటి?
7Q. మీరు "విశ్వాసము"ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, మరి ఏమిటి?
8Q. ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని "విశ్వాసము"ను ఎటువంటిది?
9Q. మీరు ఎటువంటి వారు కాక, "విశ్వాసము" చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించు చున్నాము?
10Q. ప్రభువు మీరు యెంత "విశ్వాసము" గలవారైతే ఈ కంబళిచెట్టును చూచి నీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును.
11Q. ఏ పట్టణపువారు వారి పట్టణము నలువది దినములకు నాశనమగునని దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి.?
12. విశ్వాసమునుబట్టి ఎవరు వేగులవారిని సమాధాన ముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపక పోయెను.?
13Q. నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు ఏమి గలవాడు అని యేసు చెప్పెను.?
14Q. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇకమీదట నా కొరకు ఏ కిరీటముంచబడియున్నది అని పౌలు చెప్పెను?
15Q. విశ్వాసమునుబట్టి ఎన్ని దినములవరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను.?
Result: