1. యెహోవా ఆదుకొను సేవకుడు తన యొక్క దేనిని"వీధిలో"వినబడనియ్యడు?
2. ఏది "వీధులలో"కేకలు వేయుచున్నది?
3. నా తండ్రి షోమ్రోనులో "వీధులు"కట్టించుకొనెనని ఎవరు ఆహాబుతో అనెను?
4. నా శత్రువులను "వీధుల"పెంటను ఒకడు పారబోయునట్లు నేను వారిని పారబోసితినని ఎవరు అనెను?
5. ఎప్పుడు "వీధి"తలుపులు మూయబడును?
6. నిత్యమైన దేనికి పోవుచున్న వాని నిమిత్తము ప్రలాపించువారు "వీధులలో" తిరుగుదురు?
7. "వీధులను"త్రొక్కించుటకు నా ఉగ్రతకు పాత్రులగు జనులను గూర్చి ఎవరికి ఆజ్ఞాపించెదనని యెహోవా అనెను?
8. ఎవరు సంత"వీధులలో గోనెపట్ట కట్టుకొందురని యెహోవా అనెను?
9. దేని కుమారులు "వీధుల"న్నిటి చివరలలో పడియున్నారని యెహోవా అనెను?
10. యెరూషలేము "వీధులలో"జ నులు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు గదా అని యెహోవా ఎవరితో అనెను?
11. "వీధులలో" ఎవరు లేకుండను మరణము కిటికీలను ఎక్కుచున్నది?
12. ఎటువంటి భోజనము చేయువారు దిక్కులేక "వీధులలో"పడియున్నారు?
13. దుర్దినమున జనులు దేనిని "వీధులలో" పారవేయుదురు?
14. ఎప్పుడు జనులు "వీధులన్నిటిలో"కూడి అయ్యో శ్రమ అందురు?
15. ఏ పట్టణపు వారు "వీధుల"లోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి?
Result: