1. జనులు ఎక్కడ నుండి రేకులుగా సాగగొట్టబడిన "వెండిని"తెత్తురు?
2. దేని చేత "వెండిని"పరిశోధింప వచ్చును?
3. కొలిమిలో "వెండి" కరుగునట్లు ఎవరు దానిలో కరిగిపోవుదురని యెహోవా సెలవిచ్చెను?
4. "వెండి"లోని ఏమి తీసివేసిన యెడల పుటము వేయువాడు పాత్ర యొకటి సిద్ధపరచును?
5. ఏ దేశపు అధిపతి తన ధనాగారములోనికి "వెండిని"తెచ్చుకొనెను?
6. ఏ రాజు దినములలో "వెండి"యెన్నికకు రాలేదు?
7. తమ ఇండ్లను "వెండితో" నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించి యుందునని ఎవరు అనెను?
8. కుటుంబములోని ఎవరు మందిరము పనినెరవేర్చుటకు రెండు లక్షల యాబది వేల తులముల "వెండిని"అర్పణగా ఇచ్చిరి?
9. ఏ రాజు ఆతివిస్తారమైన "వెండిని" సంపాదించి బొక్కసములను కట్టించెను?
10. దేనికి ప్రతిగా "వెండిని" తెచ్చుచున్నానని యెహోవా అనెను?
11. తూరు పట్టణపువారు వేటి యంత విస్తారముగా "వెండిని"సమకూర్చుకొనిరి?
12. ఎవరిని "వెండిని" నిర్మలము చేయునట్లు యెహోవా చేయును?
13. దేశములోని ఎన్నవ భాగమును శేషించి దానిని "వెండిని"శుద్ధి పరచునట్లు శుద్ధిపరతునని యెహోవా అనెను?
14. "వెండిని" వేసినట్లు కాకుండా ఎక్కడ పరీక్షింతునని యెహోవా అనెను?
15. "వెండిని"నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావని ఎవరు అనెను?
Result: