1Q. యేసు - ఎవడైనను నన్ను "వెంబడింప" గోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, దేనిని నెత్తి కొని నన్ను వెంబడింపవలెను?
2 Q. నా ప్రాణము నిన్ను అంటి "వెంబడించు" చున్నదని ఎవరు అనెను?
3 Q. యేసు - నన్ను "వెంబడించు" వాడు చీకటిలో నడువక ఏమి కలిగి యుండును?
4Q అహంకారము "వెంబడి" ఏమి వచ్చును?
5Q. దేనిని జరిగించుటకై సమూహమును "వెంబడించ" వద్దు?
6 Q. ఎవరు యెహోవాను హత్తుకొని, ఆయనను "వెంబడించుట"లో వెనుక తీయలేదు?
7Q. ఎవరు సమస్తమును విడిచిపెట్టి, లేచి, యేసును "వెంబడించెను"?
8Q. యేసు నా "వెంబడి" రండి, నేను మిమ్మును ఎవరిని పట్టుజాలరులనుగా చేతునని శిష్యులతో చెప్పెను?
9 Q. ఎవరు ఇశ్రాయేలువారి చర్యలను "వెంబడింపక" దేవుని ఆజ్ఞలననుసరించి నడుచుకొనెను?
10 Q. ఎవరి యెడల యేసు చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను "వెంబడించిరి"?
11.నీవు ఇతర దేవతలను "వెంబడింప" వలదని ఎవరికి ఆజ్ఞాపించినను అతని హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయెను?
12. నేను పోయి నా తలిదండ్రులను ముద్దుపెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను "వెంబడించెదనని" ఎవరు ఎవరితో అనెను?
13 Q. నా " వెంబడి" రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దని ఎవరు ఎవరితో అనెను?
14.మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను "వెంబడించితిమి" గనుక మాకేమి దొరకునని ఎవరు యేసును అడుగెను?
15Q. యేసు - ఏవి నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను "వెంబడించును" ?
Result: