1: గిద్యోనును అతనితో నున్న జనులందరును,"వేకువ"ను లేచి హరోదు బావియొద్ద దిగగా లోయలోని మోరె కొండకు ఉత్తరముగా ఎవరి దండుపాళెము వారికి కనబడెను.?
2. యెహోషువ "వేకువ"ను లేచినప్పుడు అతడును ఇశ్రా యేలీయులందరును షిల్తీమునుండి బయలుదేరి ఎక్కడకు వచ్చి దానిని దాటకమునుపు అక్కడ నిలిచిరి.?
3 Q. తెల్లవారి "వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించువరకు వాక్యము ఏమి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు ఏమి కలుగును.?
4 Q. "వేకువ"జామున ఎవరి అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచెను?
5 Q. నేను "వేకువ" రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలోనివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును. ఈ వాక్యము ఎన్నవ కీర్తనల లోనిది?
6 Q. మద్యము త్రాగుదమని "వేకువ"నే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాల రాత్రివరకు పానముచేయువారికి ఏమి కలుగును.?
7Q. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ------------ ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు "వేకువ" చుక్క వలె ఉదయించును,------------ నీకు శీఘ్రముగా లభించును.?
8: ఉదయమున యెహోషువ "వేకువ"ను లేచి జనులను వ్యూహపరచి, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును జనులకుముందుగా దేని మీదికి పోయిరి.?
9Q. తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? వేటిని పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి.?
10Q. యేసు, ఎవరి వేరు చిగురును సంతానమును, ప్రకాశమానమైన "వేకువ" చుక్కయునై యున్నారు.?
11Q. "దేవా,నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును" ఈ మాటలు పలికిన వ్యక్తి ఎవరు.?
12Q. పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు ఎవరి మార్గము అంతకంతకు తేజరిల్లును.?
13: మీరు వేకువనే లేచి చాలరాత్రియైన తరువాత పండు కొనుచు ఏవిధమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే.?
14Q. "సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మును గాక వెలుగుకొరకు దినము యెదురుచూడగా వెలుగు లేకపోవును" ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ ఏమిటి.?
15. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి ఏవిధంగా ఎంచబడును.?
Result: