Telugu Bible Quiz Topic wise: 809 || తెలుగు బైబుల్ క్విజ్ ( "వేగము" అనే అంశము పై క్విజ్ )

1. ఇశ్శాకారీయులును బారాకును అతి"వేగము"గా దేనిలో చొరబడిరి?
Ⓐ మైదానములో
Ⓑ అరణ్యములో
Ⓒ యెడారిలో
Ⓓ లోయలో
2. యెహోవాను విడిచి జనులు చేసిన దుష్కార్యము వలన వారు "వేగము"గా నశించువరకు యెహోవా వారి మీదికి ఏమి తెప్పించును?
Ⓐ శాపము
Ⓑకలవరము
Ⓒ గద్దింపు
Ⓓ పైవన్నియు
3. యాకోబుకు గురుపోతు "వేగము"వంటి "వేగము" కలదని ఎవరు ప్రవచించెను?
Ⓐ హనానీ
Ⓑ బిలాము
Ⓒ గాధు
Ⓒ యెహూ
4. తన శత్రువులను శపించుటకు ఎవరు బిలామును "వేగము"గా వెళ్లమనెను?
Ⓐ బాలాకు
Ⓑ సీసెరా
Ⓒ హెబెరు
Ⓓ యెజెరు
5. ఎవరి పరాక్రమశాలులలో కొందరు కొండలలో నుండు జింకలంత "వేగము"కలవారు?
Ⓐ రూబేనీయుల
Ⓑ గాదీయుల
Ⓒ ఆషేరీయుల
Ⓓ దానీయుల
6. దేవుని మందిరమును నశింపజేయుటకు చెయ్యి చాపిన వారిని దేవుడు నశింపజేయునను ఎవరు ఇచ్చిన ఆజ్ఞను అతి "వేగము"గా జరుగవలెనని వ్రాయించిరి?
Ⓐ కోరెషు
Ⓑ అర్త హషస్త
Ⓒ దర్యావేషు
Ⓓ అహష్వేరోషు
7. రాజనగరు పనికి పెంచబడిన వేటిమీదనెక్కి అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతి "వేగము"గా బయలుదేరిరి?
Ⓐ ఒంటెల
Ⓑ కంచరగాడిదల
Ⓒ గాడిదల
Ⓓ బీజాశ్వముల
8. యెహోవా యొక్క ఏమి "వేగము"గా పరుగెత్తును?
Ⓐ వాక్యము
Ⓑ ఆజ్ఞలు
Ⓒ కట్టడలు
Ⓓ విధులు
9. ఎక్కడ నుండి యెహోవా పిలిచిన జనులు త్వరపడి "వేగము"గా వచ్చుచున్నారు?
Ⓐ నలుదిశల
Ⓑ భూమ్యాంతముల
Ⓒ భూదిగంతముల
Ⓓ లోకమంతటా
10. యెహోవా "వేగము"గల ఏమి ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు?
Ⓐ గుర్రము
Ⓑ సింహము
Ⓒ మేఘము
Ⓓ వాయువు
11. ఇశ్శాకారీయులును బారాకును అతి"వేగము"గా దేనిలో చొరబడిరి?
Ⓐ మైదానములో
Ⓑ అరణ్యములో
Ⓒ యెడారిలో
Ⓓ లోయలో
12. యెహోవా యొక్క గుర్రములు వేటి కంటే "వేగము"కలవి?
Ⓐ గ్రద్దల
Ⓑ డేగల
Ⓒ రాబందుల
Ⓓ చిరుతపులుల
13. ఎవరి రాజుల రధముల "వేగము"నకు తండ్రులు భయపడి బలహీనమై తమ పిల్లల తట్టు కూడా చూడరు?
Ⓐ ఐగుప్తీయ
Ⓑ ఫిలిష్తీయ
Ⓒ సమరియ
Ⓓ మోయాబు
14. దేవుడైన యెహోవా ఎలా నీ ముందర దాటిపోవును గనుక కనాను దేశనివాసులను "వేగము" గా నశింపజేసెదరని మోషే జనులతో అనెను?
Ⓐ మేఘస్థంభమై
Ⓑ యుద్ధసన్నద్ధుడై
Ⓒ దహించుఅగ్నియై
Ⓓ పరాక్రమశాలియై
15. కల్దీయుల గుర్రములు వేటికంటే "వేగము"గా పరుగులెత్తును?
Ⓐ దుప్పుల
Ⓑ జింకల
Ⓒ ఆడవిలేళ్ళ
Ⓓ చిరుతపులుల
Result: