1. పురుష "వేషము"వేసికొనిన స్త్రీ,స్త్రీ "వేషము" ధరించిన పురుషుడు యెహోవాకు ఏమై యుండును?
2. ఎవరు ఇశ్రాయేలుకు లోబడినట్లుగా "వేషము"వేయుదురు?
3. ఎవరు మారు"వేషము" ధరించి కర్ణపిశాచముగల స్త్రీ యొద్దకు పోయెను?
4. రోగివైనట్టు "వేషము"వేసుకొనుమని ఎవరు ఆమ్నోనుతో అనెను?
5. ఎవరు నాకు లోబడినట్టు "వేషము" వేయుదురని దావీదు అనెను?
6. గిబియోను నివాసులు ఏమని "వేషము" వేసుకొని యెహోషువ యొద్దకు వచ్చిరి?
7. యరొబాము మారు "వేషము"వేసుకొని ప్రవక్తయగు ఎవరి యొద్దకు వెళ్లమని తన భార్యతో చెప్పెను?
8. ప్రవక్తల శిష్యులలో ఒకడు మారు "వేషము"వేసుకొని మార్గములో ఏ రాజు రాకకై కనిపెట్టుకొని యుండెను?
9. పగవాడు దేనిని కపట "వేషము" చేత దాచుకొనును?
10. పై "వేషముకే"యెహోవా వైపు తిరిగినది ఎవరు?
11. ప్రవేశ్యా "వేషము" వేసుకొనిన ఏమి గలస్త్రీ బుద్ధిలేని పడుచువానిని ఎదుర్కొన వచ్చెను?
12. అతిశయకారణము వెదకువారు ఎవరి "వేషము"ధరించుకొనిన వారై మోసగాండ్రగు పనివారునై యున్నారు?
13. సాతాను తానే ఏమి "వేషము" ధరించుకొని యున్నాడు?
14. ఎవరు మాయా "వేషముగా" దీర్ఘప్రార్ధనలు చేయుదురని యేసు అనెను?
15. దేవుడు ఎవరి "వేషము"చూడడని పౌలు అనెను?
Result: