Telugu Bible Quiz Topic wise: 814 || తెలుగు బైబుల్ క్విజ్ ( "వ్యాధి" అనే అంశము పై క్విజ్ )

1. Diseases అనగా అర్ధము ఏమిటి?
Ⓐ వ్యాధులు
Ⓑ రోగములు
Ⓒ జబ్బులు -కాయిలా
Ⓓ పైవన్నియు
2. కాయిలా పడి చనిపోయిన ఎవరిని మొట్టమొదటిగా సుగంధద్రవ్యములతో సిద్ధపరచిరి?
Ⓐ యాకోబును
Ⓑ శారాను
Ⓒ యోసేపును
Ⓓ ఇస్సాకును
3. యరొబాము కుమారుడైన ఎవరు కాయిలా పడగా అతని భార్యను మారువేషము వేసుకొని అహీయా యొద్దకు అతను వెళ్లమనెను?
Ⓐ షేపాఠ్య
Ⓑ అబీయా
Ⓒ ఆర్యా
Ⓓ మెహెతు
4. మేడగది కిటికీలో నుండి పడి రోగియైన రాజు ఎవరు?
Ⓐ ఆహాబు
Ⓑ ఆహాజు
Ⓒ అహజ్యా
Ⓓ ఆజర్యా
5. పాదములలో జబ్బు పుట్టినను యెహోవా యొద్ద విచారణ చేయని రాజు ఎవరు?
Ⓐ మనష్షే
Ⓑ ఆహాబు
Ⓒ హోషేయ
Ⓓ ఆసా
6. ఆహాబు కుమారుడైన యెహోరాము రోగియై యున్నాడని అతని దర్శించుటకు వచ్చిన యూదా రాజైన ఎవరికి దేవుని వలన నాశము కలిగెను?
Ⓐ అజర్యా
Ⓑ యోతాము
Ⓒ అహజ్య
Ⓓ జెకర్యా
7. యెహోవా కుదరని వ్యాధి చేత ఎవరి ఉదరమున మొత్తెను?
Ⓐ ఆహాబు
Ⓑ యెహోరాము
Ⓒ బయెష
Ⓓ ఒమ్రి
8. ఏ ప్రవక్త మరణకరమైన రోగము చేత పీడితుడాయెను?
Ⓐ నాతాను
Ⓑ అహీయా
Ⓒ హనానీ
Ⓓ ఎలీషా
9. యూదా రాజైన ఎవరికి మరణకరమైన రోగము కలిగెను?
Ⓐ ఉజ్జీయాకు
Ⓑ హిజ్కియాకు
Ⓒ యోతాముకు
Ⓓ అబీయాకు
10. ఎవరు రోగము గల గొర్రెలను స్వస్థపరచరని యెహోవా అనెను?
Ⓐ యాజకులు
Ⓑ వైద్యులు
Ⓒ కాపరులు
Ⓓ సేవకులు
11. కఠినమైన క్షయ వ్యాధి ఏ దేశములో కలదు?
Ⓐ అష్షూరు
Ⓑ ఐగుప్తు
Ⓒ సొదొమ
Ⓓ ఎదోము
12. ఇశ్రాయేలు యూదా వారి యొక్క వ్యాధి ఎటువంటిదని యెహోవా అనెను?
Ⓐ విస్తృతమైనదని
Ⓑ వేదనకరమైనదని
Ⓒ ఘోరమైనదని
Ⓓ వింతయైనదని
13. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడని యెహోవా ఎవరి ద్వారా ప్రవచించెను?
Ⓐ యిర్మీయా
Ⓑ యోవేలు
Ⓒ యెహెజ్కేలు
Ⓓ యెషయా
14. ఏ రాజు మరణదినము వరకు కుష్టరోగియై యుండెను?
Ⓐ ఉజ్జీయా
Ⓑ ఆహాబు
Ⓒ మనష్షే
Ⓓ ఆసా
15. తాను చూచిన దర్శనమును బట్టి మూర్ఛిల్లి వ్యాధిగ్రస్తుడైనదెవరు?
Ⓐ జెకర్యా
Ⓑ యిర్మీయా
Ⓒ దానియేలు
Ⓓ ఆమోసు
Result: