1. ఎవరు మానవ హస్తపు "వ్రేళ్ళు"గోడపూత మీద వ్రాయుట చూసెను?
2. ఒక్కొక్క చేతికి ఆరేసి "వ్రేళ్ళు "గల యెత్తరియైన ఒకడు ఏ సంతతివాడు?
3. తాము "వ్రేళ్ళతో"చేసిన దానికి నమస్కరించు ఏ దిక్కుదేశ జనులతో ఇశ్రాయేలీయులు కలిసిరి?
4. బొట్టన "వ్రేళ్ళు "కోయబడిన ఎంతమంది రాజులు అదోనిబెజెకు రాజు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి?
5. ఐగుప్తు మీదకు పేలు వచ్చినపుడు ఎవరు దానిని చూచి యిది "దేవుని వ్రేలు" (దైవశక్తి) అనెను ?
6. జనుల "వ్రేళ్ళు" దేని చేత అపవిత్రపరచబడియున్నవి?
7. ఎటువంటి మాటలు పలుకువాడు "వ్రేళ్ళతో గురుతులు చూపును?
8. దేని యెదుట తన "వ్రేలితో అహరోను కోడెరక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను?
9. దేవుని "వ్రేలితో" వ్రాయబడిన ఎన్ని రాతి పలకలు యెహోవా మోషేకు ఇచ్చెను?
10. యెహోవా మందిరము దేని యొక్క దళసరి నాలుగు "వ్రేళ్ళు"?
11. గుణవతి యైన భార్య తన "వ్రేళ్ళతో" ఏమి పట్టుకొని వడుకును?
12. యెహోవా మన "వ్రేళ్ళకు "ఏమి నేర్పువాడై యున్నాడు?
13. మోయశక్యము కాని బరువులు కట్టి తమ "వ్రేలితో"నైనను కదిలింపని వారు ఎవరు?
14. ఏ సముద్రతీరమున యేసు చెవుడుగల వాని చెవులలో తన "వ్రేళ్ళు"పెట్టి వాని స్వస్థపరచెను?
15. లమ్మి చేతి "వ్రేళ్ళ" నుండి ఏమి గడియల మీద ప్రసరించెను?
Result: