1. నీతిని అనుసరించి నడుచుచు యధార్ధముగా మాటలాడువానికి వాని యొక్క ఏమి "శాశ్వతముగా"నుండును?
2. యెహోవా శాసనములు "శాశ్వతమైన" ఏమి గలవి?
3. "శాశ్వతముగా "దేనిని దాస్తునిగా చేసికొనునట్లు ఆది నిబంధన చేయునా అని యెహోవా యోబుతో అనెను?
4. నీతిని విత్తువాడు "శాశ్వతమైన"ఏమి పొందును?
5. ఎవరికి చూపిన "శాశ్వత"కృపను యెహోవా చూపెదననెను?
6. యెహోవా సీయోనును "శాశ్వతమైన" దేనిగా చేయును?
7. యెహోవా తనకు "శాశ్వతమైన" ఏమి కలుగజేసుకొనుటకు నీళ్ళను విభజించెను?
8. యెహోవా "శాశ్వతమైన"ప్రేమతో ప్రేమించి విడువక ఏమి చూపును?
9. ఏ కొండ యందు యెహోవా "శాశ్వత కాలము"వరకు రాజుగా నుండును?
10. ఎప్పుడు మొదలుకొని యెహోవా "శాశ్వత కాలము"ప్రత్యక్షమగుచుండెను?
11. "శాశ్వతముగా " సింహాసనాసీనుడైన యెహోవా ఏమి తీర్చుటకు తన సింహాసనమును స్థాపించియుండెను?
12. ఎవరి దేవుడైన యెహోవా "శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము"వరకు స్తుతింపబడును?
13. "శాశ్వత కాలము" యొక్క దేనిని యెహోవా నరుల హృదయమందుంచియున్నాడు?
14. ఎవరిని "శాశ్వతమైన"ప్రేమతో ప్రేమించువారికి కృప కలుగును?
15. "శాశ్వతమగు "జీవముగల దేవుని వాక్య మూలముగా ఎక్కడ నుండి పుట్టింపబడిన వారము?
Result: