Telugu Bible Quiz Topic wise: 825 || తెలుగు బైబుల్ క్విజ్ ( "శాసనము" అనే అంశముపై క్విజ్ )

1 ప్ర. ఎవరికి యెహోవా శాసనములు గల పలకలను ఇచ్చెను?
A యెహోషువకు
B అహరోనుకు
C ఎలియాజరుకు
D మోషేకు
2 . "శాసనము"అను మాట ఏ అధ్యాయములో ఎక్కువ మారులు కనిపించును?
A కీర్తనలు 119
B సామెతలు 20
C యిర్మీయా 50
D యెషయా 60
3 ప్ర. యెహోవా శాసనములను గైకొనుచు ఎలా ఆయనను వెదకువారు ధన్యులు?
A శ్రద్దగా
B జాగ్రత్తగా
C పూర్ణహృదయముతో
D మంచి ప్రవర్తనతో
4 ప్ర.షడ్రకు మెషెకు అబెద్నెగో దేవుడు పూజార్హుడు అని శాసనమును నియమించిన రాజు ఎవరు?
A కోరేషు
B దర్యావేషు
C బెల్ససరు
D నెబుకద్నెజరు
5 . యెహోవా నియమించిన శాసనములను ఎలా ఆచరింపవలెను?
A విధేయతతో
B భయముతో
C జాగ్రత్తగా
D వినయముగా
6 ప్ర. యెహోవా శాసనములు ఏమై యున్నవి?
A ఉల్లాసకరములు
B మహిమకరములు
C సంతోషకరములు
D ఆనందభరితములు
7ప్ర. మరణ శాసనము వ్రాసినవాడు ఏమి పొందితేనే అది చెల్లును?
A హక్కు
B మరణము
C అధికారము
D ఆధిపత్యము
8 . యెహోవా శాసనములు ఎటువంటివి?
A మహిమకరములు
B ప్రభావంతములు
C ఆశ్చర్యములు
D వెలుగుకరములు
9 ప్ర. రాజును తప్ప ఎన్ని దినములు ఏ దేవుని మానవుని యొద్ద మనవి చేయకూడదని శాసనము పుట్టెను?
A అరువది
B ముప్పది
C ఇరువది
D డెబ్బది
10 ప్ర. వేటిని బట్టి యెహోవా తన శాసనములను నియమించెను?
A జ్ఞానము ; యదార్ధత
B ఐశ్వర్యము ; వివేకము
C నీతి; పూర్ణ విశ్వాస్యత
D బుద్ధి; సత్యము
11. యెహోవా శాసనములు ఏమియై యుండెను?
A బోధలు
B ఆలోచన కర్తలు
C ప్రవచనములు
D ధ్యానములు
12. యెహోవా శాసనములు ఏమైన నీతిగలవి?
A పూర్ణమైన
B సంతోషమైన
C శాశ్వతమైన
D విస్తారమైన
13. యెహోవా శాసనములు నాకు ఏమై యున్నవని కీర్తనాకారుడు అనెను?
A అనుసరణలు
B అతిప్రియములు
C మేలుకరములు
D ఆశీర్వాదములు
14. సిగ్గుపడక ఎవరి యెదుట యెహోవా శాసనముల గురించి మాటలాడవలెను?
A రాజుల
B అధిపతుల
C పెద్దల
D ప్రధానుల
15. యెహోవా శాసనములను గ్రహించునట్లు ఏమి కలుగజేయుమని ఆయనను అదుగవలెను?
A వివేకము
B విధేయత
C తెలివి
D జ్ఞానము
Result: