1. ఎవరిలో "శేషించినవారిని "తప్పక సమకూర్చుదునని యెహోవా అనెను?
2. శ్రమదినమందు ఎవరికి "శేషించినవారిని "శత్రువుల చేతికి ఆప్పగింపకూడదని యెహోవా ఎదోముకు సెలవిచ్చెను?
3. యాకోబు సంతతిలో "శేషించినవారు"గొర్రెల మందలను త్రొక్కి చీల్చు దేనివలెను ఉందురు?
4. ఏ దేవత యొక్క భక్తులలో "శేషించినవారిని"నిర్మూలము చేసెదనని యెహోవా సెలవిచ్చెను?
5. ఎవరి ఆస్తిని కొల్లపెట్టి నరహత్య బలత్కారము చేసిన వారిలో "శేషించిన "జనులు వానిని కొల్లపెట్టుదురు?
6. యెహోవా జనులలో "శేషించువారు"ఏ దేశములను దోచుకొందురని ఆయన సెలవిచ్చెను?
7. యెహోవా "శేషించిన "జనులందరి యొక్క దేనిని ప్రేరేపింపగా వారు దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి?
8. జనులలో "శేషించిన" వారు ఏమి కాకుండా పట్టణములో నిలుతురని యెహోవా సెలవిచ్చెను?
9. యెహోవా ఎవరి సంతతిలో "శేషించినవారి" యందు కనికరించును?
10. యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో "శేషించినవారందరు"యెహోవా యను రాజుకు మ్రొక్కుటకును ఏ పండుగ ఆచరించుటకు వత్తురు?
11. ఇశ్రాయేలు యింటివారిలో "శేషించినవారిని"ఏమి వచ్చువరకు ఎత్తుకొనువాడను నేనే అని యెహోవా అనెను?
12. యాకోబు సంతతిలో "శేషించిన వారు" యెహోవా కురిపించు దేని వలె నుందురు?
13. తన యొక్క దేనిలో "శేషించినవారి" దోషమును యెహోవా పరిహరించును?
14. యెహోవా "శేషించినవారు"ఎలా ఉత్సాహధ్వని చేయుదురు?
15. ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు వచ్చినపుడు ఆయన యొక్క ఎవరిలో "శేషించినవారును" వారితో కూడా తిరిగి వత్తురు?
Result: