1Q. ఆశీర్వాదము పొందగోరి శ్రద్ధతో వెదకినను మారుమనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడిన వ్యక్తి ఎవరు?
2Q. అవసరమునుబట్టి సమయోచితముగా వేటిని శ్రద్ధగా చేయుట నేర్చుకొనవలెను?
3Q. పౌలు యొక్క సంకెళ్లనుగూర్చి సిగ్గుపడకశ్రద్ధగావెదకి,కనుగొని, అనేక పర్యాయములుఆదరించిన వ్యక్తి ఎవరు?
4Q. సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై దేనితో ఒకనినొకడు సహించుకొనవలెను?
5Q. శ్రద్ధగా పనిచేయువారు ఏమి చేయుదురు?
6Q. ఏ రాజైతే తన దేశములో భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములయందుఏమి కలుగును?
7Q. దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయ దృష్టికి న్యాయమైనది చేసినయెడల ఎవరికి కలుగ జేసిన రోగములలో ఏదియు రానియ్యను అని యెహోవా సెలవిచ్చెను?
8Q. ప్రభువు దృష్టియందు మాత్రమే కాక ఎవరి దృష్టియందు యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనవలెను?
9Q. శ్రద్ధగలవారి యోచనలు ఎటువంటివి?
10Q. శ్రద్ధ గలవాడు ఏమగును?
11Q. "దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను" ఈమాట పలికింది ఎవరు?
12Q. సొలొమోను రాజుగా ఉన్న కాలములో మహా బలాఢ్యుడు, యౌవనుడై పనియందు "శ్రద్ధ" గల వ్యక్తి ఎవరు?
13Q. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు ఏమగును?
14Q. సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై దేనితో ఒకనినొకడు సహించుకొనవలెను?
15Q. ఎవరి అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచు ఉండవలెను?
Result: