①. దీర్ఘదేహులైన ఎవరు "సంకెళ్ళు"కట్టుకొని వచ్చెదరని యెహోవా అనెను?
②. రాజదేహసంరక్షకుల అధిపతి ఎవరి చేతి "సంకెళ్ళు"తీసి అతని విడిపించెదననెను?
③. దేశము రక్తముతో నిండియున్నది "సంకెళ్ళు"సిద్ధపరచుమని యెహోవా ఎవరికి సెలవిచ్చెను?
④. ఎవరి ప్రధానులందరిని శత్రువులు "సంకెళ్ళు"తో బంధించిరి?
⑤. ఎక్కడ వాసము చేసెడి అపవిత్రాత్మపట్టిన వానిని "సంకెళ్ళు"తో నైనను బంధింపలేకపోయిరి?
⑥. ఎవరు రెండు "సంకెళ్ళు"తో బంధింపబడి సైనికుల మధ్య నిద్రించుచుండెను?
⑦. యెహోవాను బయలువెళ్లకుండునట్లు బరువైన "సంకెళ్ళు"నాకు వేసియున్నాడని ఎవరు అనెను?
⑧. రాయబారియై "సంకెళ్ళ"లో ఉన్న పౌలు దేనిని ధైర్యముగా తెలియజేసెను?
⑨. ఎవరు "సంకెళ్ళ"తో బంధింపబడినను గర్వముగా ప్రవర్తించెదరు?
①⓪. యెహోవా భక్తుల చేతిలో ఇనుప "సంకెళ్ళ"తో ఎవరిని బంధించుటకు రెండంచుల ఖడ్గమున్నది?
①①. ఎవరూ పౌలు "సంకెళ్ళ"ను గూర్చి సిగ్గుపడక అతనిని శ్రద్ధగా వెదకెను?
①②. నేను సువార్త విషయమై "సంకెళ్ళ"తో బంధింపబడియున్నాను అయినను ఏమి బంధింపబడి యుండలేదని పౌలు అనెను?
①③. దయ్యము పట్టిన వానిని గొలుసులతోను కాలి "సంకెళ్ళ"తోను కట్టగా వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని ఎక్కడికి కొనిపోయెను?
①④. రెండు సంకెళ్ళ"తో పౌలును బంధించుమని ఎవరు ఆజ్ఞాపించెను?
①⑤. పెద్ద "సంకెళ్ళ"ను చేతపట్టుకొనిన దేవదూత అపవాది సాతాను అను దేనిని బంధించి అగాధములో పడవేసెను?
Result: