1. మాకు తెలిసిన సంగతులు, మా పితరులు వివరించిన సంగతులు చెప్పెదనని ఎవరు కీర్తన వ్రాసెను?
2. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నదని ప్రేమ కీర్తన వ్రాసినదెవరు?
3. సంగతి ఏమి చేయుట రాజులకు ఘనత?
4. యెహోవాకు ఏమి చేయునప్పుడు ఆయన మనకు గొప్ప, గూఢమైన సంగతులను తెలియజేయును?
5. యేడు దీపస్థంభముల సంగతిని ఏమి చేయుమని మనుష్యకుమారుడు యోహానుతో పలికెను?
6. దావీదు తాళపు చెవి కలిగి, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు ఏ సంఘమునకు సంగతులు చెప్పుచుండెను?
7. వాడియైన రెండంచులు గల ఖడ్గము గలవాడు ఏ సంఘమునకు సంగతులను చెప్పుచుండెను?
8. మొదటివాడు కడపటివాడుయై యుండి మృతులలో నుండి మరల బ్రదికినవాడు ఏ సంఘమునకు సంగతులను చెప్పుచుండెను?
9. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైనవాడు ఏ సంఘమునకు సంగతులను చెప్పుచున్నాడు?
10. ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు ఏ సంఘమునకు సంగతులను చెప్పుచుండెను?
11. అగ్నిజ్వాలల వంటి కన్నులు అపరంజి వంటి పాదములు గల దేవుని కుమారుడు ఏ సంఘమునకు సంగతులను చెప్పుచున్నాడు?
12. ఏడు నక్షత్రములను తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్థంభముల మధ్య సంచరించువాడు ఏ సంఘమునకు సంగతులను చెప్పుచున్నాడు?
13. సంఘముల సంగతులు జరిగిన తరువాత ఎక్కడ ఒక తలుపు తెరువబడి యుండెను?
14. ఏమి పలికిన సంగతులను ముద్రవేయుమని ఒక స్వరము తనతో పలుకుట యోహాను వినెను?
15. సంఘము కోసరము ఈ సంగతులను గూర్చి ఏమి ఇచ్చుటకు యేసు తన దూతను పంపియుండెను?
Result: