1. యెహోవా "సంవత్సరమును" తన యొక్క ఏమి ధరింపజేసియుండెను?
2. "సంవత్సరములు "జరుగుచుండగా ఎవరు యెహోవాను కార్యమును నూతనపరచమనెను?
3. తాను పంట వేసిన "సంవత్సరము" పరదేశములో నూరంతల ఫలము పొందినదెవరు?
4. ఏడవ "సంవత్సరము"దేనికి మహావిశ్రాంతికాలము?
5. యెహోవా లక్ష్యపెట్టు దేశముపై ఆయన కన్నులు "సంవత్సరాది"మొదలు "సంవత్సారంతము"వరకు ఉండునని ఎవరు చెప్పెను?
6. ఎన్ని "సంవత్సరములకొక"సారి పంటలో పదియవ వంతంతయు యింటిలో ఉంచవలెను?
7. తాను ఆమ్మబడిన "సంవత్సరము"లెక్కచూచుకొనిన ఎవరు క్రయధనము చెల్లించి విడుదల పొందవచ్చును?
8. సునాద "సంవత్సరమున"విడుదల అయిన పొలము యెహోవాకు ఏమగును?
9. దేశము పాడుగా నున్న డెబ్బది "సంవత్సరముల"కాలము అది విశ్రాంతి దినముల ననుభవించెనని ఎవరు అనెను?
10. యిర్మీయా చెప్పినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది "సంవత్సరములు" సంపూర్తియౌచున్నవని గ్రహించినదెవరు?
11. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చిన ఎన్నవ "సంవత్సరమందు"సొలొమోను యెహోవా మందిరము కట్టింపనారంభించెను?
12. ఎవరు తన ఏలుబడి యందు ఏడవ "సంవత్సరమున" మూడువేల ఇరువది ముగ్గురు యూదులను చెరగొనిపోయెను?
13. యెహోవా యొద్ద నుండి పదిహేను "సంవత్సరములు" ఆయుష్యముపొందినదెవరు?
14. యెహోవాను ఆశ్రయించినవాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలె నుండినపుడు అది ఏమి లేని "సంవత్సరమున"చింతనొందదు?
15. పండ్లు లేని అంజూరపు చెట్టును నరకమనిన యజమానునితో ఈ "సంవత్సరమునకు"ఉండనిమ్మని ఎవరు అనెను?
Result: