1Q. ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము ఎవరి కంటె ముందుగా ఆయన "సన్నిధి" చేరము?
2Q. పౌలు తన "సన్నిధిని" ఏవిధముగా నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను?
3Q. సకలజనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన "సన్నిధిని" ఎలా ఉండవలెను?
4Q. యెహోవా "సన్నిధిలో" నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కినదెవరు?
5 Q. నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు "సన్నిధిని" దేనిని కుమ్మరించవలెను?
6 Q. ఎవరి విగ్రహములు ఆయన(యెహోవా ) "సన్నిధిని" కలవరపడును?
7Q. ఎవరు దేవుని "సన్నిధిని" భయపడరు?
8Q దేవుని "సన్నిధిని" ఏవిధముగా పలుకుటకు హృదయమును త్వరపడనియ్యక నోటిని కాచుకొనవలెను?
9Q. ఎవరు వున్న దేశములలో యెహోవా "సన్నిధిని" నేను కాలము గడుపుదును?
10 Q. ఆయన "సన్నిధిని" నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతునని ఎవరు పలికెను?
11Q. మేము నీ "సన్నిధిని" అపరాధులము నీ గనుక నీ "సన్నిధిని" నిలుచుటకు అర్హులము కామని ప్రార్థనచేసినది ఎవరు?
12Q. యెహోవా "సన్నిధిని" గంతులు వేయుచు నాట్య మాడుచునున్న దావీదును కనుగొని, తన మనస్సులో దావీదును హీనపరచినది ఎవరు?
13 Q.ఎవరు యెహోవా "సన్నిధిని" ప్రార్థన చేయుచుండగా ఎవరు ఆమె నోరు కనిపెట్టుచుండెను?
14Q. ఎవరినీ నీ సన్నిధిని బ్రదుకననుగ్రహించుమని అబ్రాహాము దేవునితో చెప్పెను?
15Q. యెహోవా మోషేతో - నా "సన్నిధి"నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదను. ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ తెలపండి?
Result: