1. ఒక చోటనే జలములను కూర్చి ఆ జలరాశికి ఏమని పేరు పెట్టెను?
2. సముద్రతరంగములు ఎంతో పొర్లి ఘోషించిన అవి దాటకుండా దేనిని దేవుడు సరిహద్దుగా నియమించెను?
3. ఎర్ర సముద్రపు నీళ్ళను విభజించి, ఆ నీటిని అటు ఇటు వేటివలె యెహోవా చేసెను?
4. అగాధమైన సముద్రగర్భములో నన్ను పడవేసియున్నావని ఎవరు యెహోవాకు ప్రార్ధించెను?
5. యెహోవా దేనిని త్రొక్కుచు సంచరించుచున్నాడు?
6. ఎవరు నిమ్మళింపకుండా కదులుచున్న సముద్రమువంటి వారు?
7. సముద్రపు పొంగుకు ఏమి కదులును?
8. సముద్రములోని చరములను దేవుడు ఎవరి పాదముల క్రింద నుంచియున్నాడు?
9. దేని వలన యెహోవా సముద్రమును రేపును?
10. సముద్రముల మీద దేని వలన అన్యజనులు వణుకుదురు?
11. యేసు సువార్త ప్రకటించుచు ఏ సముద్రతీరమునకొచ్చెను?
12. ఏ జామున యేసు సముద్రము మీద నడుచుచూ శిష్యుల యొద్దకు వచ్చెను?
13. ఎలా ఊరకుండుమని యేసు సముద్రమునకు చెప్పెను?
14. బలమైన సముద్రతరంగముల ఘోష కంటే ఎవరు బలిష్టుడు?
15. దేవుని నదినీరు ఏ సముద్రములో పడుటవలన ఆ నీళ్ళు మంచినీళ్ళుగా అయ్యెను?
Result: