Telugu Bible Quiz Topic wise: 844 || తెలుగు బైబుల్ క్విజ్ ( "సముద్రములు" అనే అంశము పై క్విజ్ )

1. ఏమన్నియు "సముద్రములో"పడినను సముద్రము నిండుటలేదు?
ⓐ తటాకములు
ⓑ చెరువులు
ⓒ సరస్సులు
ⓓ నదులు
2. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై యున్నప్పుడు ఏవి "సముద్రములో"మునిగినను మనము భయపడము?
ⓐ పర్వతములు
ⓑ కొండలు
ⓒ శిఖరములు
ⓓ ఎత్తైన గుట్టలు
3. బండను చీల్చి "సముద్రమంత" ఎంతగా యెహోవా తన జనులను నీళ్ళు త్రాగనిచ్చెను?
ⓐ అత్యధికముగా
ⓑ సమృద్ధిగా
ⓒ లోతుగా
ⓓ విస్తారముగా
4. ఏది యెహోవాకు రాజ్యమైనపుడు "సముద్రము"దాని చూచి పారిపోయెను?
ⓐ బేతేలు
ⓑ యూదా
ⓒ ఇశ్రాయేలు
ⓓ తిర్సా
5. "సముద్రజలములను"పిలిచిన యెహోవా వాటిని ఎక్కడ పొర్లిపారజేయును?
ⓐ అగాధములో
ⓑ లోయలలో
ⓒ భూమిమీద
ⓓ అరణ్యములో
6. ఎక్కడ నుండి వచ్చిన యొక జనము స్వరము "సముద్ర ఘోష"వలె నుండునని యెహోవా సెలవిచ్చెను?
ⓐ తూరు దేశము
ⓑ ఉత్తరదేశము
ⓒ దక్షిణ దేశము
ⓓ తూర్పు దేశము
7. దేని యొక్క "సముద్రము"మీద విచారము కలదని యెహోవా సెలవిచ్చెను?
ⓐ దమస్కు
ⓑ ఎదోము
ⓒ ఐగుప్తు
ⓓ బబులోను
8. సీయోను కుమారికి కలిగిన ఏమి "సముద్రమంత"గొప్పది?
ⓐ అపాయము
ⓑ నాశనము
ⓒ అవమానము
ⓓ పరాభవము
9. "సముద్రము"దేని మీదికి వచ్చెనని యెహోవా సెలవిచ్చెను?
ⓐ మోయాబు
ⓑ అమ్మోనియా
ⓒ బబులోను
ⓓ సిరియ
10. యెహోవా తన దినమున "సముద్రము" మీద నున్న దేనిని సంహరించును?
ⓐ భుజంగమును
ⓑ నాగుపామును
ⓒ నీటిగుర్రమును
ⓓ మకరమును
11. "సముద్రము"దాని తరంగములను పొంగజేయురీతిగా అనేక జనములను ఏ పట్టణము మీదికి రప్పించెదనని యెహోవా అనెను?
ⓐ ఆమోరీయా
ⓑ దేదాను
ⓒ తూరు
ⓓ సీదోను
12. "సముద్రపు"ఊటలలోనికి నీవు చొచ్చితివా? అని యెహోవా ఎవరిని అడిగెను?
ⓐ యిర్మీయాను
ⓑ యెహెజ్కేలును
ⓒ యోవేలును
ⓓ యోబును
13. ఎవరు "సముద్రముల" ఆర్భాటము వలె ఆర్భటించును?
ⓐ అన్యజనులు
ⓑ భూపతులు
ⓒ బహుజనములు
ⓓ రాజులు
14. పరలోకములో సింహాసనము ఎదుట స్ఫటికము పోలిన దేని వంటి "సముద్రము"న్నట్లుండెను?
ⓐ సీసము
ⓑ గాజు
ⓒ తగరము
ⓓ పాదరసము
15. దేవుని యొక్క ఏమిగల వారై జయించిన వారుస్ఫటికపు "సముద్రము"నొద్ద నిలిచియుండుట యోహాను చూచెను?
ⓐ తంబుర
ⓑ సితార
ⓒ పిల్లనగ్రోవి
ⓓ వీణెలు
Result: