1. "Maritime" అనగా అర్ధము ఏమిటి?
2. సముద్రజలములను పిలిచి యెహోవా వాటిని ఎక్కడ పొర్లిపారజేయును?
3. సముద్రతరంగము లెంత పొంగి ఘోషించినను అది దాని దాటకుండునట్లు యెహోవా ఇసుకను ఎలా నియమించెను?
4. సముద్రపు చేపలు యెహోవాకు భయపడి ఏమగును?
5. యెహోవా దేని దాటి సముద్ర తరంగములను అణచివేయును?
6. ఓహో ఎవరు సముద్రముల ఆర్భాటము వలె ఆర్భటించుచున్నారు?
7. నేను సముద్రమునా?సముద్రములో భుజంగమునా? అని ఎవరు అనెను?
8. యెహోవా పిలిచిన దూరమున నున్న జనములు సముద్రఘోష వలె జనము మీద ఏమి చేయుదురు?
9. ఏ జనులు చేయు హేయక్రియల వలన సముద్ర మత్స్యములు గతించిపోవుచున్నవి?
10. ఏది సముద్ర తరంగముల ధ్వనితో నిండుకొనును?
11. యోహోవా తన యొక్క దేనితో సముద్రమును ఎండజేయును?
12. ఎక్కడ నుండి వచ్చిన వారి స్వరము సముద్రఘోష వలె నున్నదని యెహోవా సెలవిచ్చెను?
13. సముద్రము దాని తరంగములు పొంగజేయు రీతిగా యెహోవా ఎవరి మీదికి అనేక జనములను రప్పించెదననెను?
14. యెహోవా మాట ఆలకించిన యెడల ఇశ్రాయేలు యొక్క ఏమి సముద్ర తరంగముల వలె నుండునని యెహోవా అనెను?
15. ఎటువంటి సముద్ర తరంగముల ఘోష కంటే ఆకాశమున యెహోవా బలిష్టుడు?
Result: