1. దేని యొక్క "సరిహద్దులను" విశాలపరచి యెహోవా తనను తాను మహిమపరచుకొనెను?
2. దేనికి యెహోవా "సరిహద్దులను"నియమించెను?
3. యూదా వారి ఎవరు "సరిహద్దు" రాళ్లను తీసివేయువారివలెనున్నారు?
4. ఎవరు నియమించిన పొరుగువాని "సరిహద్దు"రాతిని తీయకూడదు?
5. తన పొరుగువాని "సరిహద్దు"రాయిని తీసివేయువాడు ఏమగును?
6. ఏ నది మొదలుకొని ఐగుప్తు "సరిహద్దు" వరకు సొలొమోను ప్రభుత్వము చేసెను?
7. ఆర్నోను దేనికి "సరిహద్దు"?
8. దేని "సరిహద్దు"వరకు బొత్తిగా పాడుచేసి యెడారిగా ఉంచెదనని యెహోవా అనెను?
9. "సరిహద్దు"రాళ్లను తీసివేయుకలవారు కలరు అని ఎవరు అనెను?
10. తమ "సరిహద్దులను"మరి విశాలము చేయదలచి గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చినదెవరు?
11. ఏ దేశము యొక్క "సరిహద్దు"నొద్ద యెహోవాకు ప్రతిష్టితమైన యొక స్థంభము ఉండును?
12. ఎవరు ఇశ్రాయేలీయుల "సరిహద్దులలో"ప్రవేశించినపుడు యెహోవా వారిని రక్షించును?
13. ప్రశస్తమైన వేటితో యెహోవా "సరిహద్దులను"ఏర్పర్చును?
14. యెహోవా "సరిహద్దులలో"ఏమి కలుగజేయును?
15. ఇశ్రాయేలీయుల "సరిహద్దులలో" యెహోవా ఎలా ఉండెను?
Result: