1. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని "సహవాసము"నకు మిమ్మును పిలిచిన ఎవరు నమ్మతగినవాడు?
2. దేవునితో "సహవాసము" చేసిన యెడల నీకు ఏమి కలుగును?
3. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి ఎవరి "సహవాసము" లభించును?
4. ఇశ్రాయేలీయులు ఎవరితో "సహవాసము" చేసి వారి క్రియలు నేర్చుకొనిరి?
5. ఎవరి "సహవాసము" కొరుకొనకూడదు?
6. రాజులను నశింపజేయు ఎవరితో "సహవాసము" చేయకుము?
7. తుంటరుల "సహవాసము" చేయు కుమారుడు తన తండ్రికి ఏమి తెచ్చును?
8. దేవునితో "సహవాసము" గల వారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనమబద్ధమాడుచు దేనిని జరిగింపకుందుము?
9. వాక్యమును అంగీకరించినవారు అపొస్తలుల "సహవాసము" నందు ఏవిధముగా యుండిరి?
10. ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే ఎవరు దేవునితో "సహవాసము" కలిగి ఉండవలెను?
11. ఎవరి "సహవాసము" చేయువాడు చెడిపోవును?
12. దేనిలో మనము నడిచినయెడల దేవునితో అన్యోన్య "సహవాసము" గల వారమైయుందుము?
13. ఎవరితో "సహవాసము" చేయకూడదు?
14. దుష్ట "సాంగత్యము" దేనిని చెరువును?
15. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, ఎవరి "సహవాసము"ను మనకందరికి తోడైయుండును గాక?
Result: