1. "Fraternity" అనగా అర్ధము ఏమిటి?
2. "సహోదర" ప్రేమను ఎలా ఉండనియ్యవలెను?
3. "సహోదరులు"ఏమి కలిగి నివసించుట ఎంత మేలు మనోహరము?
4. "సహోదర" ప్రేమ విషయములో ఒకని యందొకడు ఏమి గలవారై యుండవలెను?
5. తన "సహోదరుని"చూచి ఏమి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును?
6. ఏకమనస్కులై "సహోదర"ప్రేమ గలవారుగా ఉండవలెనని ఎవరు చెప్పెను?
7. తన "సహోదరుని"ద్వేషించువాడు ఎక్కడ యున్నాడు?
8. ఏ సంఘములోని "సహోదరులు" మంచివారును సమస్త జ్ఞానసంపూర్ణులని పౌలు అనెను?
9. దీనుడైన "సహోదరుడు"తనకు కలిగిన ఉన్నతదశ యందు అతిశయింపవలెనని ఎవరు చెప్పెను?
10. "సహోదరుడా" ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపియున్నాడని ఎవరు సౌలుతో అనెను?
11. నా "సహోదరుడా" నీవు నాకు ఆతి మనోహరుడవని దావీదు ఎవరి గురించి అనెను?
12. యోసేపు తన "సహోదరులకు"తన్ను తాను తెలియజేసుకొని ఎలా ఏడ్చెను?
13. సంఘము యొక్క "సహోదరులు" ఏకభావముతో మాటలాడవలెనని పౌలు అనెను?
14. ఎవరు తన "సహోదరుల"కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును?
15. మనము "సహోదరులను" ప్రేమించుచున్నాము గనుక దేనిలో నుండి జీవములోనికి దాటియున్నాము?
Result: