1. మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగియున్నానో దేవుడే "సాక్షి" అని పౌలు ఏ సంఘముతో అనెను?
2. వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఎవరు "సాక్షి"గా వచ్చెను?
3. నాకు "సాక్షి"యైనవాడు పరలోకమందున్నాడు అని ఎవరు చెప్పెను?
4. కూట"సాక్షి" ఏమి పొందకపోడు?
5. నీవు నేనును ఏమి చేసికొనిన యెడల అది "సాక్షి"గా యుండునని లాబాను యాకోబుతో అనెను?
6. క్రీస్తు గూర్చి "సాక్షి" యైన ఎవరు పెర్గము సంఘము మధ్య చంపబడెను?
7. వ్యర్థుడైన "సాక్షి" దేనినపహసించును?
8. యెహోవా మనతో మాటలాడిన మాటలకు ఏది "సాక్షి"గా యుండునని యెహోషువ జనులతో అనెను?
9. ఒక "సాక్షి" మాట మీదనే ఎవనికిని ఏమి విధించకూడదు?
10. "సాక్షి" కుప్పను హెబ్రీలో ఏమందురు?
11. గొప్ప "సాక్షి" సమూహము దేని వలె మనలను ఆవరించెను?
12. నమ్మకమైన "సాక్షి"ఎవరని యోహాను వ్రాసెను?
13. నా ఇష్టానుసారుడై, నా ఉద్దేశములను నెరవేర్చునని దేవుడు ఎవరి గురించి "సాక్ష్యమిచ్చెను"?
14. మంచి "మనస్సాక్షి" కలవాడవని పౌలు ఎవరితో చెప్పెను?
15. ఎటువంటి "మనస్సాక్షి" కలవారమై యుండవలెను?
Result: