Telugu Bible Quiz Topic wise: 856 || తెలుగు బైబుల్ క్విజ్ ( "సాక్షి(సాక్షులు)" అనే అంశము పై క్విజ్ )

① వ్యర్థుడైన సాక్షి దేనిని అపహసించును?
Ⓐ సత్యమును
Ⓑ నీతిని
Ⓒ న్యాయమును
Ⓓ మంచిని
② ఒక్క సాక్షి మాట మీద ఏమి విధింపకూడదు?
Ⓐ దండన
Ⓑ కఠినశిక్ష
Ⓒ కొరడాదెబ్బలు
Ⓓ మరణశిక్ష
③ వేటిని గూర్చి ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు?
Ⓐ దోషము : అతిక్రమము
Ⓑ పాపము : అపరాధము
Ⓒ ద్రోహము : దొంగతనము
Ⓓ అన్యాయము ; అక్రమము
④ ఇశ్రాయేలీయులు యెహోవాను విసర్జించిన యెడల తాను నిలువబెట్టిన రాయి సాక్షిగా నుండునని ఎవరు అనెను?
Ⓐ యెహోషువ
Ⓑ సమూయేలు
Ⓒ అహరోను
Ⓓ గిద్యోను
⑤ యేసును దేవుడు లేపెను;దీనికి మేమందరము సాక్షులమని ఎవరు అనెను?
Ⓐ యాకోబు
Ⓑ యోహాను
Ⓒ పేతురు
Ⓓ ఫిలిప్పు
⑥ నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు ఊరియాను జెకర్యాను సాక్షులుగా పెట్టెదనని యెహోవా ఎవరితో అనెను?
Ⓐ యిర్మీయా
Ⓑ యెషయా
Ⓒ ఆమోసు
Ⓓ యోవేలు
⑦. అబద్ధసాక్షులు నా మీదికి లేచియున్నారని ఎవరు యెహోవాతో అనెను?
Ⓐ యోబు
Ⓑ దావీదు
Ⓒ హిజ్కియా
Ⓓ అసాపు
⑧ ప్రజలను పెద్దలను శాస్త్రులును ఎవరి కొరకు అబద్ధసాక్షులను నిలువబెట్టిరి?
Ⓐ పౌలు
Ⓑ స్తెఫను
Ⓒ పేతురు
Ⓓ యాకోబు
⑨ స్తెఫను నిమిత్తము సాక్షులుగా ఉన్నవారు ఎవరి పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి?
Ⓐ గమలీయేలు
Ⓑ ఫేస్తు
Ⓒ సౌలు
Ⓓ అననీయ
10 ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెనను పౌలు ఏ సంఘముతో అనెను?
Ⓐ గలతీ
Ⓑ కొరింథీ
Ⓒ ఫిలిప్పీ
Ⓓ ఎఫెసీ
①① ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే గాని పెద్ద మీద ఏమి అంగీకరింపకూడదు?
Ⓐ నేరారోపణ
Ⓑ అన్యాయవాదన
Ⓒ దోషారోపణ
Ⓓ అపనింద
①② అనేక సాక్షుల యెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొనినదెవరు?
Ⓐ తిమోతి
Ⓑ తీతు
Ⓒ ఏపప్ర
Ⓓ ఒనేసేము
①③ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినదని పౌలు ఏ సంఘముతో అనెను?
Ⓐ గలతీ
Ⓑ కొలొస్సీ
Ⓒ హెబ్రీ
Ⓓ ఎఫెసీ
①④ మనుష్యులు క్షయపత్రములు వ్రాయించుకొని ముద్రలు వేసి సాక్షులను పెట్టుదురని ఎవరితో యెహోవా చెప్పెను?
Ⓐ సమూయేలుతో
Ⓑ యిర్మీయాతో
Ⓒ యెహెజ్కేలుతో
Ⓓ యెషయాతో
①⑤. ఎడతెగక నా మీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవు అని ఎవరు యెహోవాతో అనెను?
Ⓐ యాకోబు
Ⓑ దావీదు
Ⓒ ఆసాపు
Ⓓ యోబు
Result: