1. ఏమి తినవలసిన ఏడుదినములలో ప్రతివాడు తినవలసినది మాత్రమే "సిధ్ధపరచవచ్చును?
2. ప్రజలు మూడుదినముల లోగా దేనిని దాటవలెను గనుక ఆహారమును "సిద్ధపరచు"కొనుమని యెహోషువ చెప్పెను?
3. బయట పని చక్కపెట్టుకొని ముందుగా ఎక్కడ దాని "సిద్ధపరచ"వలెను?
4. ఎక్కడ యెహోవాకు మార్గము "సిద్ధపరచ"వలెను?
5. యెహోవాను ఎవరు ఎరుగకుండునప్పటికీ యెహోవా అతని "సిద్ధపరచెను"?
6. రోషు మెషెకు తుబాలునకు అధిపతియైన ఎవరిని యెహోవా తనను సిద్ధపడి తన సమూహమును "సిద్ధపరచ"మనెను?
7. విస్తారమైన ఆస్తి సంపాదించుకొనిన ధనవంతునితో దేవుడు-వెర్రివాడా, ఈ రాత్రి నీయొక్క ఏమి అడుగుచున్నారు,నీవు "సిద్ధపరచి"నవి ఎవనివగుననెను?
8. పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి "సిద్ధపరచ"వలెనని ఎవరు యేసును అడిగిరి?
9. ఎప్పుడు తెల్లవారుచుండగా స్త్రీలు తాము "సిద్ధపరచిన"సుగంధ ద్రవ్యములను తీసుకొని యేసు సమాధి యొద్దకు వచ్చిరి?
10. కంటికి కనబడనివి చెవికి వినబడనివి మనుషుని యొక్క దేనికి గోచరము కానివి దేవుడు "సిద్ధపరచెను"?
11. ఇస్సాకు రుచిగల భోజ్యములను "సిద్ధపరచి"నేను తినుటకై తెమ్మని ఎవరితో అనెను?
12. దేవుడు ముందుగా "సిద్ధపరచిన"ఏమి చేయుటకై క్రీస్తుయేసు నందు మనలను సృష్టించెను?
13. ఏ దినము "సిద్ధపరచు"దినము?
14. దేవుడు సకల ప్రజల యెదుట "సిద్ధపరచిన" రక్షణను కన్నులారా చూచితినని ఆనినదెవరు?
15. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు "సిద్ధపరచ"బడిన దేనిని స్వతంత్రించుకొనుమని రాజు తన కుడివైపున ఉన్నవారితో అనెను?
Result: